Begin typing your search above and press return to search.
మాజీ సీజే రంజన్ గొగొయ్ కి సుప్రీం 'క్లీన్ చిట్' !
By: Tupaki Desk | 18 Feb 2021 12:20 PM GMTలైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌కు సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. గొగొయ్ పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు 2019 నాటి ఉత్తర్వుల ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలు ఆయనపై కుట్రను ప్రేరేపించాయని పేర్కొంది. జస్టిస్ గొగొయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉందని నివేదిక స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ పొందలేకపోయిందని వ్యాఖ్యానించింది.
ఎన్ ఆర్ సీ లాంటి కేసుల్లో జస్టిస్ గొగొయ్ ఇచ్చిన తీర్పులపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అందువల్ల తాము ఈ కేసును మూసివేస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.
కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ గొగొయ్ పై వచ్చిన ఆరోపణలు విచారణర్హం కాదని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. రిజిస్ట్రీలో ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కొన్ని కఠినమైన పరిపాలనా నిర్ణయాలు మాజీ చీఫ్ జస్టిస్ తీసుకున్నారని పేర్కొన్నారు. 'ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలను చేసినట్టు మేం అభిప్రాయపడ్డాం.. సుమోటాగా స్వీకరించిన ఈ కేసును మూసివేస్తున్నామని స్పష్టం చేసింది. ఎప్పుడో జరిగిన సంఘటనలను, జరిగాయో లేదో తెలియని అంశాలను తెరమీదకు తీసుకువచ్చి జస్టిస్ గొగొయ్ పై అనుమానాస్పదంగా చూపించడం ద్వారా సుప్రీం స్వతంత్రతపై దాడి చేసే కుట్ర జరుగుతోందని అనిపిస్తుంది. హార్వర్డ్ లా స్కూల్ లో న్యాయవిద్యను అభ్యసించిన ఉత్సవ్ బెయిన్స్ గొగొయ్ పై ఆ'రోపణలు చేశారు.