Begin typing your search above and press return to search.

మన దేశంలో కరెన్సీకి సుప్రీం అథారిటీ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 2:30 AM GMT
మన దేశంలో కరెన్సీకి సుప్రీం అథారిటీ ఎవరో తెలుసా?
X
మనిషి పొద్దంతా కష్టపడేది డబ్బు కోసమేనన్న సంగతి అందరికీ విదితమే. ఈ ప్రపంచంలో అనగా భూమండలం మీద ప్రతీ ఒక్కరు మనీ కోసం కష్టపడుతుంటారు. అయితే, కరెన్సీని ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తుంటారు. ఇండియాలో అయితే 'రూపాయి' అని పిలుస్తారు. రూపాయలలోనే డబ్బులను లెక్క కడుతుంటారు. అలా ప్రపంచం మొత్తం డబ్బు మీద ఆధారపడి నడుస్తున్నది. అయితే, డబ్బు లేకపోతే జీవితం లేదు ఉండదు కూడా. ప్రతీ పనికి అనగా తిండికి, ఉండటానికి, దుస్తులకు అన్నిటికీ డబ్బులు అవసరం.

ఈ నేపథ్యంలోనే డబ్బులు సంపాదించేందుకుగాను ఆడ, మగ ఇద్దరూ కష్టపడుతుండటం మనం చూడొచ్చు. భారతదేశంలో కరెన్సీకి సుప్రీం అథారిటీ ఆర్‌బీఐ కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే డబ్బులను ముద్రిస్తుంది. బ్యాంకర్స్ బ్యాంక్‌గా పేరొందిన ఆర్‌బీఐ.. మనీని నోట్లు, నాణేలుగా ముద్రిస్తుంది. ఈ కరెన్సీని మన దేశంలో నాలుగు కరెన్సీ ప్రెస్‌లలో ముద్రిస్తారు. వీటిలో రెండు.. భారత ప్రభుత్వం తన కార్పొరేషన్, సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ముద్రిస్తుంది. మిగిలిన రెండు పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ యాజమాన్యంలోనే ఉంటాయి.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కరెన్సీ ముద్రించబడుతుది. ఎస్‌పీ‌ఎంసీఐఎల్ యాజమాన్యంలోని నాలుగు మింట్లలో నాణేలు ముద్రిస్తారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ద్వారా మాత్రమే నాణేలు జారీ చేయబడుతాయి. కరెన్సీ నోట్లు కూడా ఆర్‌బీఐనే జారీ చేస్తుంది. వీటిని ఇతరులెవరూ ముద్రించకుండా ఉండేందుకుగాను వాటికి సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేస్తుంది. ఆ వాటి ఆధారంగా మన చేతికి వచ్చిన నోటు సరైనదా కాదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఆర్‌బీఐ నోట్స్‌లో కనిపించే సెక్యురిటీ ఫీచర్స్ ఇవే.. రూ.10, 20, 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లలో సిల్వర్ కలర్ మెషిన్ రీడబుల్ ‘సెక్యూరిటీ థ్రెడ్' ముందు వైపున పూర్తిగా రివర్స్ సైడ్‌లో పొందుపరచి ఉంటుంది.

అల్ట్రాలైట్ దీని గుండా వెళ్లినపుడు రెండు వైపులా యెల్లో కలర్ థ్రెడ్ బయటకు కనిపిస్తుంది. ఆ లైట్‌కు అపోజిట్ వే‌లో ఉంచినప్పుడు థ్రెడ్ వెనుక నుంచి నిరంతర రేఖ కనిపిస్తుంది. ఇకపోతే రూ.వంద లేదా అంతకంటే ఎక్కువ వాల్యు కలిగిన నోట్లను వివిధ కోణాల నుంచి చూసినపుడు మెషీన్-రీడెబుల్ విండోడ్ సెక్యురిటీ థ్రెడ్ గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్‌కు మారుతుంది. రివర్స్‌లో యెల్లో ఫ్లోరోస్ కనిపిస్తుంది.

నోటు పై ఉండే జాతిపిత మహాత్మాగాంధీ ఫొటో, రిజర్వ్ బ్యాంక్ ముద్ర, హామీ, ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్, వాగ్దానం నిబంధన, అశోక స్తంభం చిహ్నం, దృష్టి లోపం ఉన్న వ్యక్తుల గుర్తింపు గుర్తు రూ .వంద లేదా అంతకన్నా ఎక్కువ మొత్తం నోట్లపైన ముద్రించబడి ఉంటుంది. నోట్ ఎడమ వైపున ప్రతీ డినామినేషన్ సంఖ్యా భాగంలో ముందు భాగంలో, రివర్స్‌లో ముద్ర ఉంటుంది., బ్యాక్ టు బ్యాక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటిగా కనిపిస్తుంటుంది.

నోట్లపైన ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ కూడా ఉంటుంది. రూ .200, 500, 2000 నోట్లపై 200, 500, 2000 అనే సంఖ్యా కలర్ రంగు మారే సిరాలో ముద్రించారు. నోట్లను ఫ్లాట్‌గా ఉంచినప్పుడు ఈ సంఖ్యల రంగు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. అయితే, నోట్లను ఒక కోణంలో ఉంచినప్పుడు బ్లూ కలర్‌లోకి ఈజీగా చేంజ్ అవుతుంటుంది. నెంబరింగ్ నమూనా కూడా ఉంటుంది. నోట్లపైన యాంగిల్ వైజ్ బ్లీడ్ లైన్స్ కూడా ఉంటాయి.