Begin typing your search above and press return to search.

ఆ సూపర్ స్టార్ లో క్రికెట్ అభిమానం కూడానా?

By:  Tupaki Desk   |   17 March 2023 4:45 PM GMT
ఆ సూపర్ స్టార్ లో క్రికెట్ అభిమానం కూడానా?
X
ఆయన పుట్టింది మహారాష్ట్రలో.. పనిచేసింది కర్ణాటకలో.. స్టార్ గా ఎదిగింది తమిళనాడులో.. తెలుగులోనూ అభిమానం సొంతం చేసుకుని.. విదేశాల్లోనూ ప్రజాదరణ పొందాడు.

కానీ, అత్యంత సాధారణ జీవనం. సాదాసీదా ఆహార్యం.. ఎక్కడా ఆడంబరాలు ఉండవు. ప్రజలకు ఏదైనా చేయాలనే ధ్యాసతో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోయినా ఆరోగ్య కారణాలతో వెనకడుగు వేశాడు. చివరకు ఎప్పటిలానే తనకిష్టమైన సినీ రంగంలో కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

ఇంతకీ ఆయనెవరో తెలిసిందా? పైన చెప్పుకొన్న ఉదాహరణతో ఆయన ఎవరో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుందనుకుంటా?మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్. అశేష జనాదరణ ఉన్న ఆయన రోబోతో పన్నెండేళ్ల కిందటే బాలీవుడ్ ను షేక్ చేశారు. నాలుగు దశాబ్దాల క్రితమే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ తో కలిసి నటించారు. తెలుగులో ఎన్టీఆర్ కుటుంబం,దాసరి నారాయణరావు అంటే ఎంతో ఇష్టం. ఇక చిరంజీవి, మోహన్ బాబు చిరకాల స్నేహితులు.

ఆధ్యాత్మిక కోణమే అనుకుంటే..తెలుగు సినీ తారల్లో క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు విక్టరీ వెంకటేష్. మరికొందరికీ క్రికెట్ పిచ్చి ఉన్నా.. వెంకటేష్ వారికంటే ఎక్కువ అభిమాని. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆయన మైదానంలో కనిపిస్తుంటారు. కానీ, రజనీకాంత్ విషయానికి వస్తే ఆయన పూర్తిగా తనదైన లోకంలో ఉంటారు. హిమాలయాలకు వెళ్లిపోతుంటారు. అక్కడ తపస్సులో మునిగిపోతుంటారు. ఇక రజనీ ప్రసంగాల్లోనూ ఆధ్యాత్మిక చింతన కనిపిస్తుంటుంది.

ఏ శక్తి ద్వారానో ఈ లోకంలోకి వచ్చాం.. మనల్ని ఎవరో నడిపిస్తున్నారు.. అనేది ఆయన భావన. అందుకనే రజనీ ఐహిక సుఖాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, అలాంటి రజనీకాంత్ శుక్రవారం హఠాత్తుగా క్రికెట్ మైదానంలో ప్రత్యక్షమయ్యారు. భారత్-ఆసీస్ మధ్య మ్యాచ్ ను చూశారు.

వినేందుకే ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి.. అకస్మాత్తుగా రజనీకి క్రికెట్ మీద అభిమానం ఎందుకో తెలియడం లేదు. ఏదైనా సినిమా షూటింగ్ కు ముంబై వెళ్లి పనిలో పనిగా మ్యాచ్ చూసేందుకు హాజరయ్యారా? అనే అనుమానం కలుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.