Begin typing your search above and press return to search.
సూపర్స్మార్ట్ కొరియర్ బాయ్.. గుర్రంపై వెళ్లి పార్శిల్ ఇస్తున్నాడు..!
By: Tupaki Desk | 17 Jan 2021 6:30 AM GMTప్రస్తుతం చాలా మంది షాపింగ్ వెళ్లడం తగ్గించేశారు. తమకు కావాల్సిన వస్తువులన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తువులు దొరుకుతుండటం.. ఇంటికే వస్తుండటంతో ప్రజలు ఈ కామర్స్ సంస్థలవైపు మొగ్గుచూపుతున్నారు. దీనివల్ల అనేకమందికి ఉపాధి కూడా దొరికింది. అయితే తాజాగా అమెజాన్లో పనిచేసే ఓ కొరియర్ బాయ్ గుర్రం మీద వెళ్లి డెలివరీ ఇస్తున్నాడు.
నిజానికి కొరియర్ సర్వీస్ వాల్లు టూవీలర్ మీద వస్తువులు తీసుకొస్తుంటారు. ఒకవేళ వస్తువు పెద్దదైతే వ్యాన్లో తీసుకొస్తారు. కానీ జమ్ముకశ్మీర్లో ఓ కొరియర్ బాయ్ మాత్రం గుర్రం మీద వస్తువులు డెలివరీ చేస్తున్నాడు. అందుకు కారణం అక్కడ పొగమంచు విపరీతంగా కమ్ముకున్నది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వినియోగదారులకు ఎలాగైన సరుకులు డెలివరీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఓ కొరియర్ బాయ్ ఇలా గుర్రం మీద వెళ్లి వస్తువులు ఇచ్చేసి వస్తున్నాడు.
అయితే ఫొటో జర్నలిస్ట్ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. అయితే కొరియర్ బాయ్ తెలివిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొరియర్ బాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు గుర్రపుస్వారీ అంటే ఎంతో ఇష్టం. పైగా ఇప్పుడు చలికాలం కావడంతో ఇక్కడ మంచు కమ్ముకున్నది. దీంతో వాహనాలు వెళ్లడం ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఇలా గుర్రం మీద వెళ్లి డెలివరీ ఇస్తున్నాను’ అంటూ ఆయన చెప్పాడు.