Begin typing your search above and press return to search.
కరెంట్ తో నడిచే సూపర్ ఫాస్ట్ విమానాలు.. ఇక భవిష్యత్ అంతా వీటిదేనా?
By: Tupaki Desk | 5 Oct 2020 2:30 AM GMTవిమానాల తయారీలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు విమానాల తయారీలో తమ ప్రత్యేకత చూపేందుకు శ్రమిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ ఇప్పుడో అద్భుత ఆవిష్కరణ చేపట్టింది. ప్రస్తుతం ఉన్న విమానాలకంటే రెట్టింపు వేగంతో నడిచే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలున్న విమానాలను తయారు చేయబోతోంది. ఈ విమానాలు కూడా విద్యుత్ తోనే నడుస్తాయట. వీటితో పర్యావరణ కాలుష్యం ఉండదట. ఇప్పటికే పరీక్షలు పూర్తిచేసుకున్నాయి. ఈ విమానాలు గనక సక్సెస్ అయితే భవిష్యత్ అంతా వీటిదేనని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ విమానాలు మామూలు వాటికంటే అత్యంత వేగంగా వెళతాయని రోల్స్ రాయీస్ చెబుతోంది.
అందులో వినియోగించే టెక్నాలజీని కూడా ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. ఈ విమానానికి ‘అయాన్ బర్డ్’గా నామకరణం చేసిన రోల్స్ చేశారు. రెప్లికా వెర్షన్ టెస్ట్ సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందట. 500 హార్స్ పవర్ సామర్థ్యం ఉన్న విమానం క్షణాల్లో సూపర్ వేగాన్ని అందుకోగలదని రోల్స్ రాయిస్ డైరెక్టర్ రాబ్ వాట్సన్ వివరించారు.ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్.. 250 ఇళ్లకు వినియోగించే విద్యుత్‌తో సరిసమానమని చెప్పారు. కరోనా నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారమే టెస్ట్ నిర్వహించామని చెప్పారు. అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని తెలిపారు. 2050 నాటికి ఈ తరహా విమానాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.