Begin typing your search above and press return to search.

ఆ దేశంలో మగ వేశ్యలకు మస్తు డిమాండ్

By:  Tupaki Desk   |   5 Nov 2019 5:06 AM GMT
ఆ దేశంలో మగ వేశ్యలకు మస్తు డిమాండ్
X
యూరోపియన్ దేశాల్లో జర్మనీ కాస్త విలక్షణమైన దేశంగా చెబుతారు. రెండు ప్రపంచ యుద్ధాలు జర్మనీ పుణ్యమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. సంప్రదాయబద్ధంగా ఉండటంతో పాటు.. అంత సోషల్ గా కనిపించని వైనం వారిలో ఎక్కువని చెబుతారు. అంతేకాదు.. తమ జాతి విషయంలో వారికుండే ప్రేమాభిమానాలు ఎక్కువే కాదు.. ప్రపంచంలోని మిగిలిన జాతులతో పోలిస్తే.. తామే ఉన్నతులమన్న భావన కూడా ఎక్కువని చెబుతారు. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పే జర్మన్లలో ఇప్పుడు కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి.

ఆ దేశంలోని మహిళల అభిరుచిలోనూ.. జీవనశైలిలో వచ్చిన మార్పు తాజా అధ్యయనం ఒకటి బయటపెట్టింది. ఇటీవల కాలంలో జర్మనీలో మగ వేశ్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు. ముఖ్యంగా దేశంలోని మహిళలు మగ వేశ్యలకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? వివాహ బంధానికి దూరంగా ఉంటూ.. మగ వేశ్యలతో ఎందుకు గడుపుతున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి.

జర్మనీ మహిళలు ఎక్కువగా టెక్నాలజీ రంగాన్ని ఎంచుకోవటం.. కుటుంబంతో గడిపే అవకాశం తగ్గిపోవటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో జర్మనీ యువకులు వివాహ బంధానికి ఎక్కువ మక్కువ చూపించటం లేదంటున్నారు. ఈ కారణంతో పెళ్లి కంటే కూడా సమయానికి అవసరమైన డేటింగ్ తో సరి పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటంతో పురుషులు ఈజీమనీ కోసం వేశ్యవృత్తిని ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జర్మనీకి దగ్గర్లోని సిరియా.. గ్రీస్ దేశాల్లో తలెత్తిన పరిస్థితుల కారణంగా ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న యువకులు వేశ్యవృత్తిని ఎంచుకుంటున్నట్లు గుర్తించారు. ఏమైనా.. మారిన జర్మనీ మహిళల అభిరుచికి సంబంధించిన అధ్యయనం ఇప్పుడు సంచలనంగా మారినట్లు తెలుస్తోంది.