Begin typing your search above and press return to search.
గూగుల్ లో ‘సుపారి కిల్లర్ విజయవాడ’.. కట్ చేస్తే ఎన్ని దారుణాలో
By: Tupaki Desk | 30 Jun 2021 4:30 PM GMTపగలు..ప్రతీకారాలు తీర్చుకోవటానికి.. హత్యలు చేయటానికి సుపారీ ఇవ్వటం పాత విషయమే. మారిన కాలానికి అనుగుణంగా.. సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన మాథ్యమాల సాయంతో హత్యలకు డీల్ చేస్తున్న తీరు చూస్తే.. వణుకు పుట్టాల్సిందే. సంచలనంగా మారిన తల్లీకుమార్తెల దారుణ హత్యల వెనుక గుట్టును రట్టు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు వెల్లడించిన వివరాలు విని అవాక్కు అయ్యారు. కొత్త తరహా నేరాలకు ఆన్ లైన్ ఎలా వేదికగా మారుతుందన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తోంది.
ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు సోషల్ మీడియా సాయంతో కలుసుకోవటమే కాదు.. హత్యలకు ప్లాన్ చేసిన వైనం షాక్ కు గురి చేస్తుంది. మంచిర్యాలకు చెందిన 47 ఏళ్ల విజయలక్ష్మి.. 26 ఏల్ల రవీనా హత్యకు గురయ్యారు. గత ఏడాది జూన్ లో రవీనాకు నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన అరుణ్ తో పెళ్లైంది. వారిది ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధించేవాడు. దీంతో వాటిని భరించలేని రవీనా పుట్టింటికి వచ్చింది. తల్లి ఆమెకు అబార్షన్ చేయించింది. దీంతో.. తల్లీకూతుళ్లపైన అరుణ్ పగ పెంచుకున్నాడు. ఇద్దర్నీహత్య చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా గూగుల్ లో సుపారి కిల్లర్ విజయవాడ అనే ఐడీ కనిపించింది. ఆయుధాలు అమ్ముతామని.. సుపారీ తీసుకొని హత్యలు..కిడ్నాప్ లు చేస్తామని అందులో సమాచారం ఉంది. ఒక ఫోన్ నెంబరు కూడా అందులో పెట్టారు.
వారిని సంప్రదించిన అరుణ్ కుమార్ కు.. తనను తాను బిట్టూగా పరిచయం చేసుకున్నాడు. అరుణ్ చెప్పిన హత్యలకు రూ.10లక్షలు అవుతుందని చెప్పగా.. తనవద్ద అంత డబ్బులు లేవని.. తన అత్తారింట్లో ఎప్పుడూ రూ.4లక్షల క్యాష్.. 20 తులాల బంగారం ఉంటుందని.. వాటిని తీసుకోవాలని చెప్పాడు. దీంతో.. డీల్ కు ఓకే చెప్పాడు బిట్టూ.
తెనాలికి చెందిన సుబ్బుతో కలిసి బిట్టూ హత్యకు ప్లాన్ చేశాడు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. తెనాలికి చెందిన సుబ్బుకు బిట్టూ పరిచయం కూడా ఆన్ లైన్ లోనే సాగింది. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళను హత్య చేసేందుకు ఆన్ లైన్ లో బిట్టును సంప్రదించాడు. అందుకు రూ.2 లక్షలు అవుతుందని చెప్పగా.. తాను అంత డబ్బు సమకూర్చలేదని చెప్పి.. అతడు చేసే హత్యలకు సహకరిస్తానని డీల్ చేసుకున్నాడు.
ఇలా ఏ మాత్రం పూర్వ పరిచయం లేని ముగ్గురు మూడు హత్యలకు ప్లాన్ చేయటం.. తాము అనుకున్నట్లే మంచిర్యాలకు వెల్లి విజయలక్ష్మీ.. రవీనాలను హత్య చేసి.. బంగారం..నగదుతో పారిపోయారు. అనంతరం పోలీసుల గాలింపులో చిక్కారు. మరో ట్విస్టు ఏమంటే.. ఈ హత్యల్లో కీలక భూమిక పోషించిన బిట్టూ గతానికి వస్తే.. గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన రోషయ్య డిగ్రీ చదివి.. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతడు.. గూగుల్ లో ఆయుధాలు అమ్ముతామన్న సందేశానికి ఆకర్షితుడై.. రూ.30వేలకు గన్ కొనేందుకు డీల్ చేసుకున్నాడు. అయితే.. ఆ ప్రకటన బోగస్ కావటంతో మోసపోయాడు. తాను అదే రీతిలో మోసం చేయాలని నిర్ణయించుకొని.. ‘సుపారి కిల్లర్ విజయవాడ’ ఐడీతో ఆయుధాలు అమ్ముతానని.. సుపారీతో హత్యలు.. కిడ్నాప్ లు చేస్తానని పేర్కొన్నాడు. ఇదంతా వింటుంటే.. వణుకు పుట్టటం లేదూ?