Begin typing your search above and press return to search.
భాగ్యనగరంలో ‘సుపారీ’ గ్యాంగ్ ఎంట్రీ .. పోలీసులకు ముచ్చెమటలు
By: Tupaki Desk | 29 Sep 2020 8:50 AM GMT‘ఎవడిని చంపాలి.. ఎప్పుడు చంపాలి.. నాకు ఎంతిస్తావు’ ఇదేదో సినిమా డైలాగ్ కాదు.. హైదరాబాద్‌లోని ఓ సుపారీ ముఠా డీలింగ్ చేసే స్టైల్. ఈ మధ్య హైదరాబాద్ లో సుపారీ గ్యాంగ్ లు పెరిగిపోయాయి. చంపాలనుకున్న వ్యక్తితో వాళ్లకు ఏ సంబంధం ఉండదు.. శత్రుత్వం ఉండదు. కేవలం డబ్బుకోసం వాళ్లు చంపేస్తారు. కోర్టులు, పోలీసులు, శిక్షలు లాంటివి వాళ్లకు పట్టవు. మీరు డబ్బిస్తే ఎవరినైనా చంపేస్తారు. రీజన్స్ వాళ్లకు అక్కర్లేదు. చంపేవాడి కోసం ఎంత రిస్క్ తీసుకోవాలి.. అనే దాన్ని బట్టి వాళ్ల రేటు డిసైడ్ చేస్తారు. హైదరాబాద్ లో చంపేందుకు ఓ రేటు.. పల్లెటూర్ లో అయితే మరో రేట్ ఫిక్స్ చేస్తారు. కేవలం కిడ్నాప్ చేసేందుకు రేటు.. హత్యాయత్నం బెదిరింపు వరకు ఇంకో రేటు ఇలా రేట్లు ఫిక్స్చేసి మరి దందా కొనసాగిస్తున్నారు. ఇది వరకు ముంబై, కలకత్తా లాంటి నగరాలకే పరిమితమైన ఈ దందా హైదరాబాద్ కు పాకింది.
10 లక్షల నుంచి కోట్ల వరకు..
ఈ సుపారీ గ్యాంగ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ లో విచ్చల విడిగా పెరిగి పోయింది. ఓ వ్యక్తిని చంపేందుకు రూ. 10 లక్షల నుంచి కోట్ల వరకు డీల్స్ మాట్లాడుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ముఠాలోని ఓ సభ్యుడు దొరికినా వాళ్లు బయపడరు. వాడి ప్లేస్‌లోకి ఇంకొకడు ఎంట్రీ ఇస్తుంటాడు. మర్డర్ చేసే వాళ్లు బీహార్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎక్కువగా వస్తున్నట్టు టాక్. ముంబై మాఫియా తరహాలో హైదరాబాద్ లోని ఈ కల్చర్ పెరిగి పోయింది.
వెబ్సైట్లలో ఫోన్‌నంబర్లు..
ఈ సుపారీ గ్యాంగ్ ఎంతకు బరితెగించందే.. వీళ్లను కాంటాక్ట్ చేసేందుక కొన్ని డార్క్ వెబ్ సైట్స్, వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. లోకల్ రౌడీ షీటర్లతో సంబంధాలు పెట్టుకొని వాళ్ల ద్వారా పార్టీలను సంపాదించుకుంటారు. ఎవరన్న ఈ సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించాలంటే.. లోకల్ రౌడీ షీటర్ల సహాయం తోనే వెళ్లుతున్నారని సమాచారం. ఇటీవల జరిగిన హేమంత్ హత్య, రెండేళ్ల క్రితం జరిగిన ప్రణయ్ హత్యలను ఈ సుపారీ గ్యాంగ్‌లే చేయడం గమనార్హం.