Begin typing your search above and press return to search.

సన్ రైజర్స్ కు కలిసిరాని హైదరాబాద్

By:  Tupaki Desk   |   19 April 2023 12:01 PM GMT
సన్ రైజర్స్ కు కలిసిరాని హైదరాబాద్
X
2020లో మొదలైన కరోనాతో ఆటలు అటకెక్కాయి. భారత్ వంటి 140 కోట్ల జనాభాలో బహిరంగ ఆటలను నిషేధించారు. ఆ ఏడాది ఐపీఎల్ కూడా సాగలేదు. 2021లో అతి కష్టం మీద దుబాయ్ లో చాలా కరోనా నిబంధనల మధ్య నిర్వహించారు. ఇక 2022లో ముంబైలో ఉన్న నాలుగు స్టేడియాల్లోనే ఐపీఎల్ ను ఆడించి మమ అనిపించారు. ఈసారి కరోనా తీవ్రత లేకపోవడంతో దేశంలోని అన్ని నగరాల్లో ఆయా ఫ్రాంచైజీలు తమ లోకల్ ఫ్యాన్స్ ను ఆహ్వానించి పోటీలు నిర్వహిస్తున్నాయి.

దేశంలోని అన్ని నగరాల్లో ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ పతాకస్థాయిలో సాగుతోంది. ప్రేక్షకులు స్టేడియంలకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ లోనూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ నిన్నటి మ్యాచ్ కు భారీగా వచ్చారు. ప్రముఖ యాంకర్ వర్షిణి, హైపర్ ఆదితో కలిసి సందడి చేసింది. వీరి అల్లరి అంతా ఇంతాకాదు. అయితే హైదరాబాద్లో సన్ రైజర్స్ కు కలిసి రావడం లేదు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ సన్ రైజర్స్ ఓడిపోవడం నిరాశకు గురిచేస్తోంది.

ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది మన సన్ రైజర్స్ టీం. ఈ జట్టుకు సొంత మైదానం కూడా కలిసి రావడం లేదు. హైదరాబాదులో ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడం గమనార్హం.

హైదరాబాద్ జట్టు. వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకుని గాడిలో పడినట్టు కనిపించినా.. హైదరాబాదులో మంగళవారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో మళ్లీ తడబాటుకు గురైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బలమైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఓటమి తప్పలేదు. ఇకపోతే సొంత గ్రౌండ్లో వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది హైదరాబాద్ జట్టు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ఓడిపోయిన మూడు మ్యాచ్ ల్లో రెండు సొంత గడ్డ మీదే కావడం గమనార్హం. మొదటి మ్యాచ్ లో రాజస్తాన్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 203 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదారాబాద్ జట్టు ఘోరంగా విఫలమై 131 పరుగులకే పరిమితమైంది. 72 పరుగులు తేడాతో రాజస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది.

తాజాగా ఇదే స్టేడియంలో జరిగిన ముంబైతో మ్యాచ్ లో 14 పరుగులు తేడాతో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ముందు మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన బ్రూక్ ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. 11 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది హైదరాబాద్ జట్టు. 25 పరుగుల వద్ద రాహుల్ త్రిపాఠి వికెట్ నష్టపోవడంతో భారీ తేడాతో ఓటమి ఫాలవుతుందని భావించారు.

మయాంక్ అగర్వాల్ 41 బంతుల్లో 48 పరుగులు చేయగా, క్లాసెన్ 16 వంతుల్లో 36 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 14 పరుగులు తేడాతో హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

నిజానికి ఏ జట్టుకైనా సొంత స్టేడియం బలం.. బలగం.. అక్కడ బాగా ఆడుతుంది. గెలుస్తుంది. ముంబై ఇండియన్స్ టీం ముంబైలో ఆడిన ప్రతీసారి గెలుస్తుంది. అలాగే చెన్నైకి అసలు చెన్నైలో ఎదురలేదు. కానీ మన హైదరాబాద్, బెంగళూరు వంటి టీంలకు సొంత మైదానాలు కలిసి రావడం లేదు. బెంగళూరు దాని సొంత స్టేడియంలో వరుసగా ఓడిపోతోంది. మన సన్ రైజర్స్ టీం కూడా అంతే. రానున్న మ్యాచ్ లలోనైనా హైదరాబాద్ కు ఉప్పల్ స్టేడియం కలిసి వస్తుందో లేదో చూడాలి మరీ.