Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్

By:  Tupaki Desk   |   9 April 2023 10:01 AM GMT
ఇంటర్నెట్ ను ఊపేస్తున్న సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్
X
సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ హావభావాలు కొద్దిరోజులుగా డల్ గా ఉన్నాయి. ఎందుకంటే గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టడగున నిలిచింది. ఈ సంవత్సరం కూడా రెండు తొలి మ్యాచ్ ల్లో ఓడి డల్ అయిపోయింది. అయితే సన్ రైజర్స్ గెలుపు కోసం దాని ఓనర్ కావ్య పడుతున్న తంటాలు అంతా ఇంతకాదు.. కెప్టెన్ మార్క్రమ్ ను సౌతాఫ్రికా నుంచి పిలిపించి మరీ జట్టును పటిష్టం చేసింది.

అయినా కూడా తొలి మ్యాచ్ లో ఆడని మార్క్రమ్ రెండో మ్యాచ్ కు వచ్చినా పెద్దగా తేడా ఏం కనిపించలేదు. అయితే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలింగ్ సమయంలో మెరుగ్గా ఆడింది. లక్నోతో మ్యాచ్ లో ఓపెనర్ ను ఔట్ చేసిన సన్ రైజర్స్ ఊపు చూసి కావ్య ఎగిరి గంతేసింది. చాలా రోజుల తర్వాత కావ్య మోములో ఆనందం చూసి ఆ వీడియోను, ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేసి తెగ హల్ చల్ చేస్తున్నారు.

స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్‌లకు మైదానంలోనే కాకుండా ప్రేక్షకుల గ్యాలరీ నుండి కూడా ఆసక్తికరమైన క్షణాలను బంధించడానికి చాలా తపన పడుతుంటారు. ఇప్పుడు కావ్య హావభావాలను చిత్రీకరించడంలో వారి నేర్పు బాగా ఉపయోగపడుతోంది.

ఐపీఎల్ లో ఈసారి పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎస్.ఆర్.హెచ్ యజమాని కావ్య మారన్ గతేడాది మాదిరిగానే మరోసారి స్టేడియంలో తనటీంకు మద్దతుగా సందడి చేశారు. లక్నో వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో కైల్ మేయర్స్ మొదటి వికెట్ ఔట్ అయిన సమయంలో కావ్య మారన్ ఆనందంతో ఎగిరి గంతేశారు.

అత్యంత ఆనందించే క్షణం ఆమెది ఇదేనంటూ ఇంత సంబురం ఎప్పుడూ సన్ రైజర్స్ కోసం చేసుకోలేదంటూ ఆమె గత ఫొటోలు.. ఈ ఫొటోలు షేర్ చేస్తూ తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పుడు కైల్ ఔట్ అయినప్పుడు కావ్యమారన్ స్పందన ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అలాగే, మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ఆమె బాధాకరమైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్ కూడా వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓడించి అగ్రస్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందకుండా లీగ్‌లో అట్టడుగున ఉంది.