Begin typing your search above and press return to search.

విశాఖలో సీఎం ఆఫీస్ ఇదేనట..?

By:  Tupaki Desk   |   5 Jan 2020 11:52 AM IST
విశాఖలో సీఎం ఆఫీస్ ఇదేనట..?
X
బీసీజీ రిపోర్ట్ రావడంతో విశాఖ పరిపాలన రాజధానిగా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖలో పర్యటించి సీఎం కార్యాలయం సహా సచివాలయం కోసం పరిశీలించారు. తాజాగా ఆదివారం ఏపీ ఉన్నతాధికారులు - వివిధ శాఖల అధిపతులు అమరావతి నుంచి విశాఖ బాటపట్టారు. విశాఖలోని భవనాలను పరిశీలించారు.

విశాఖలోని ఇన్నోవేషన్ వ్యాలీ టవర్స్ లో సన్ రైజర్స్ టవర్ ఖాళీగా ఉండడంతో దానిని పరిశీలించిన ఐటీ అధికారులు సీఎం కార్యాలయానికి అనుకూలమని తేల్చారు. పక్కనే ఉన్న మిలీనియం టవర్ సెక్రటేరియట్ కు బాగుంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఐటీ సంస్థల ప్రతినిధులతో అధికారులు భేటి అయ్యారు. మధురవాడ ఐటీ హిల్స్ లో ఉన్న భవనాలపై కూడా ఆరాతీస్తున్నారు.

ఇక విశాఖ శివార్లలోని ప్రభుత్వ భూములు, అనువైన వాటిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించింది. దాదాపు 4వేల ఎకరాలను గుర్తించి 164 ఎకరాలను సిద్ధం చేశారు. వివిధ సంస్థలకు కేటాయించి వినియోగించని భూములను ఆరాతీశారు.