Begin typing your search above and press return to search.
సన్నీలియోన్ ను నమ్ముకో..ఫస్ట్‌క్లాస్ సాధించుకో
By: Tupaki Desk | 5 Feb 2017 7:15 AM GMTకుటుంబం తర్వాత అత్యంత కీలక స్థానమైన పాఠశాలలో ఉపాధ్యాయులు పెడదారి పడుతుండటానికి ఇదో నిదర్శనం. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు కీచకులుగా మారుతున్నారు. పవిత్రమైన గురువు స్థానాన్ని అపవ్రితం చేస్తున్నారు. తమ స్థాయిని - హోదాను కూడా మరిచిపోయి పశువుల ప్రవర్తిస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. నగరంలోని సదాశివనగర్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేకెత్తిస్తోంది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన దూరగతం వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఫిర్యాదు చేసిన విద్యార్థికి సదరు ప్రిన్సిపాల్ ఏం చెప్పాడంటే... "ఓ బాయ్ ఫ్రెండ్ ని ఉంచుకో, సన్నీ లియోన్ ని రోల్ మోడల్ గా చేసుకో, సెక్స్ టాయ్స్‌ని వాడుతూ ఉండు - నన్ను తరచూ కలుస్తూ ఉండు - నేను నీకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ ఉంటాను. లేదంటే ఫస్ట్ క్లాస్ వచ్చే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు" అని తనకు ఠాకూర్ చెప్పినట్లు బాధిత బాలిక జనవరి 30న సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా, ఈ సంఘటన గత నెల 26న సాయంత్రం 7.20 గంటల ప్రాంతంలో జరిగిందని బాలిక పేర్కొంది. గత డిసెంబర్‌లో కూడా ఓ విద్యార్థినిపై ఠాకూర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/