Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీ వెబ్‌ సైట్‌ లో స‌న్నీ న‌గ్న‌చిత్రం

By:  Tupaki Desk   |   25 April 2016 1:49 PM GMT
జీహెచ్ ఎంసీ వెబ్‌ సైట్‌ లో స‌న్నీ న‌గ్న‌చిత్రం
X
పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. గూగుల్‌ లో అత్య‌ధికంగా వెతికేది ఆమె కోస‌మే అనే సంగ‌తి తెలిసిందే. అయితే ఇపుడు ఎక్క‌డో వెత‌కాల్సిన అవ‌స‌రం లేకుండా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వెబ్‌ సైట్‌ లో ఆమె చిత్రం అందుబాటులోకి వ‌చ్చింది. అది కూడా న‌గ్న చిత్రం!

ఇంత‌కీ ఈ ఆస‌క్తిక‌ర‌మైన వార్త విశేషం ఏంటంటే... జీహెచ్ ఎంసీ వెబ్‌ సైట్‌ ను వివిధ సేవ‌ల కోసం సంద‌ర్శించిన వారికి స‌న్నీలియోన్ న‌గ్న చిత్రం క‌నిపించింది. దీంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న గ్రేట‌ర్ పౌరులు జీహెచ్ ఎంసీ వ‌ర్గాలకు ఈ విష‌యాన్ని చేర‌వేశాయి. దీనిపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డంతో అధికారులు స్పందించారు. అయితే హ్యాక్ జ‌ర‌గ‌కుండా అధికారికంగానే ఈ పోస్ట్ వ‌చ్చింద‌ని తేల్చారు.

అదెలాగ అంటారా గ‌తంలో జీహెచ్ ఎంసీ వెబ్‌ సైట్‌ ను గ‌తంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వ‌హించింది. ఆ సంస్థ‌కు మ‌రిన్ని వెబ్‌ సైట్ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు కూడా ఉన్నాయి. గ్రేట‌ర్ వెబ్‌ సైట్ నిర్వ‌హ‌ణ‌ను ముగిసిపోయిన‌ప్ప‌టికీ ఆ సంస్థ రివ్యూ చేసుకోకుండా వేరే వెబ్‌ సైట్ లింక్‌ ను ఈ సైట్‌ కు ఇచ్చార‌ట‌. దీంతో జీహెచ్ ఎంసీ వెబ్‌ సైట్ లో శృంగార రాణి బొమ్మ ద‌ర్శ‌న‌మిచ్చింది. అనంత‌రం తంటాలు ప‌డి దీన్ని తొల‌గించారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే ఈ ఎపిసోడ్ ఇప్ప‌టివ‌ర‌కు గ్రేట‌ర్ అధికారులు ఎవ‌రికీ ఫిర్యాదు చేయ‌లేదు.