Begin typing your search above and press return to search.

స‌న్నీ లియోన్ కు ఉద్య‌మ‌నేత ఫుల్ స‌పోర్ట్‌

By:  Tupaki Desk   |   11 Jun 2018 8:48 AM GMT
స‌న్నీ లియోన్ కు ఉద్య‌మ‌నేత ఫుల్ స‌పోర్ట్‌
X
మాజీ అడ‌ల్ట్ స్టార్ స‌న్నీ లియోన్ పై ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి వ‌చ్చిన హార్దిక్ ను మీడియా అడిగిన ప్ర‌శ్న కార‌ణంగా స‌న్నీ లియోన్ మీద ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లో ఓట‌ర్ల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు హార్దిక్ జులైలో యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు.

దీనికి సంబంధించిన మీడియా స‌మావేశాన్ని తాజాగా ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా హార్దిక్ ను ఉద్దేశించి మీడియా ప్ర‌తినిధి ఒక‌రు స‌న్నీ లియోన్ కు సంబంధించిన ప్ర‌శ్న‌ను సంధించారు. దీనికి బదులిచ్చిన హార్దిక్‌.. స‌న్నీకి త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు.

అంతేకాదు.. ఆమెను శ్రీ‌దేవి.. మాధురి దీక్షిత్ మాదిరే చూడాల‌న్నారు.మిగిలిన బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఆమెకు తేడా లేద‌న్నారు. ఆమె గ‌తంతో సంబంధం లేద‌న్న హార్దిక్‌.. స‌న్నీ త‌న‌ను తాను నిరూపించుకుంద‌ని.. తెర మీద ఆమె న‌ట‌న‌ను మాత్ర‌మే చూడాల‌న్నారు. ఇప్ప‌టికి స‌న్నీని ఒక పోర్న్ స్టార్ త‌ర‌హాలోచూస్తే దేశం బాగుప‌డ‌ద‌న్న వ్యాఖ్య చేసిన హార్దిక్‌.. గ‌తంలోనూ ఆమెకు త‌న ఫుల్ స‌పోర్ట్ ఉంటుంద‌ని చెప్పారు. మొత్తానికి సినిమా ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ రంగంతోపాట ఉద్య‌మ నేత మ‌న‌సుల్ని స‌న్నీ గెలుచుకుంటున్నారు.