Begin typing your search above and press return to search.

స‌న్నిలియోన్ కోసం ర‌క్తం ఇచ్చిన ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   15 May 2022 11:35 AM GMT
స‌న్నిలియోన్ కోసం ర‌క్తం ఇచ్చిన ఫ్యాన్స్!
X
స్టార్ హీరోల‌పై అభిమానంతో ఫ్యాన్స్ త‌మ స్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌తీ ఏడాది ర‌క్త‌ శిబిరాలు నిర్వ‌హిస్తుంటారు. స్టార్ బ‌ర్త్ డేని త‌మ పుట్టిన రోజుగా భావించి చారిటీ కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ఎక్కువ‌గా ఈ క‌ల్చ‌ర్ కోలీవుడ్..టాలీవుడ్ లో క‌నిపిస్తుంది. సౌత్ లో ఇంకొన్ని భాష‌ల్లో క‌నిపిస్తుంటుంది. బాలీవుడ్ లో మాత్రం ఇలాంటివి పెద్ద‌గా ఉండ‌వు.

అభిమానం కేవ‌లం సోష‌ల్ మీడియాలో విష్ చేయ‌డం వ‌ర‌కూ ప‌రిమితం అవుతుంటుంది. కానీ స‌న్నిలియోన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ చేసిన హ‌డావుడి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ విష‌యం తెలుసుకున్న స‌న్నినే విస్మ‌యానికి గురైంది. ఆనందంతో ఉబ్బిత‌బ్బింది. మే 13 స‌న్నిలియోన్ పుట్టిన రోజు సందర్భంగా కొమ్మిరేహ‌ల్లి గ్రామానికి చెందిన కొంద‌రు యువ‌కులు ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేసారు.

దీంతో గ్రామంలో యువ‌కులంతా పోటీ ప‌డి ర‌క్తం దానం చేసారు. మొత్తం 39 యూనిట్ల‌ ర‌క్తాన్ని సేక‌రించారు. అంత‌కు ముందు స‌న్నిలియోన్ కి చెందిన భారీ క‌టౌట్ ఏర్పాటు చేసి దానికి పూల మాల వేసారు. అనంత‌రం క‌టౌట్ ముందు కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేష‌న్లు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌న్నిలియోన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నాగార్జున మాట్లాడుతూ..

స‌న్ని పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రామంలో యువ‌క‌లంతా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. స‌న్నిలియోన్ అంటే గౌర‌వం ఉంది. ఎన్నో చారిటీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారామె. ఎంతో మంది పిల్ల‌ల్ని ఆమె ఆదుకుంటున్నారు. ఆమె స్పూర్తితోనే గ్రామంలో స‌న్ని పేరిట అసోసియేష‌న్ ఏర్పాటు చేసాం. గ‌త రెండేళ్ల‌గా ఈ మెగా బ్ల‌డ్ క్యాంప్ నిర్వ‌హిస్తున్నాం.

మునుముందు ఈ సేవాకార్య‌క్రమాలు మ‌రింత విస్తృతం చేయాల‌నుకుంటున్నాం` అని తెలిపారు. ఈ వార్త ఓ జాతీయ వార్త ప‌త్రిక‌లో రావ‌డంతో ఆ పేపర్ క‌టింగ్ ని స‌న్నిలియోన్ త‌న ఇన్ స్టా ఖ‌తా ద్వారా అభిమానులో పంచుకుంది. ఈ సంద‌ర్భంగా సంతోషం వ్య‌క్తం చేసింది. ``ఓ దేవుడా ఇది నిజంగా న‌మ్మ‌లేక‌పోతున్నా. మీరు నాకిచ్చిన ఈ గౌర‌వానికి నేను కూడా బ్ల‌డ్ డొనేట్ చేస్తాను. ఐల‌వ్ యూ ఫ్యాన్స్ ..థాంక్యూ సోమ‌చ్`` అని కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

ఈ కార్య‌క్ర‌మంలో గ్రామంలో యువ‌కుల‌తో పాటు పిల్ల‌లు కూడా పాల్గొన్నారు. దీంతో స‌న్నిలియోన్ పై ఈ రేంజ్ లో అభిమానం కురిపించే ఫ్యాన్స్ ఉన్నారా? అని అంతా షాక్ అవుతున్నారు. కేవ‌లం స‌న్ని నుంచి ఎంట‌ర్ టైన్ మెంట్ కాదు..ఆమెలో సేవాదృక్ఫ‌ధాన్ని కూడా గుర్తించి స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డం అన్న‌ది నిజంగా హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం.

ఇక స‌న్నిలియోన్ కొద్ది రోజులుగా హైద‌రాబాద్ లోనే తిష్ట వేసింది. మంచు కాంపౌండ్ లో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంది. మంచు విష్ణు తో క‌లిసి స‌ర‌దా వీడియోలు చేస్తుంది. అవి నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో సౌత్ లో నే ఎక్కువ‌గా తిర‌గుతుంది.