Begin typing your search above and press return to search.

క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై గవాస్కర్ మండిపాటు

By:  Tupaki Desk   |   19 Jan 2019 10:55 AM GMT
క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై గవాస్కర్ మండిపాటు
X
తొలిసారి ఆసీస్ గడ్డపై దైపాక్షిక సీరిస్ ను కైవసం చేసుకున్న టీం ఇండియాకు నిర్వాహకులు సముచిత ప్రైజ్ మనీ ఇవ్వక పోవడంపై మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల ద్వారా లాభాలు పొందుతున్న నిర్వాహకులు దానిలో వాటాను పంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

చివరి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన చాహల్ కు, సీరిస్ సాంతం అద్భుతంగా రాణించిన ధోనికి రూ.35వేలు(500 డాలర్లు)తో ట్రోఫీని అందజేశారు. ఆటగాళ్లకు కేవలం 500డాలర్లు ఇవ్వడం ఏంటీ? పైగా జట్టుకు కేవలం ట్రోఫీని మాత్రమే ప్రదానం చేయడంపై గవాస్కర్ మండిపడ్డారు. ప్రసార హక్కుల ద్వారా లాభాలు ఆర్జిస్తున్న నిర్వాహకులు సముచిత ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వరని నిలదీశారు. స్పాన్సర్లు రావడానికి ప్రధాన కారణం ఆటేగాళ్లేనని గవాస్కర్ గుర్తు చేశాడు.

ఒకసారి వింబుల్డన్ నిర్వాహులు ఇస్తున్న ప్రైజ్ మనీని చూడండి అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వాహకులకు గవాస్కర్ సలహా ఇచ్చారు. వింబుల్డన్ నిర్వాహకులకు సముచితంగా రివార్డు అందజేస్తారని తెలిపారు. వింబుల్డన్ తొలి రౌండ్లో ఓడిన ఆటగాడికి రూ. 36లక్షలు అందుతాయని, విజేతలకు దాదాపు రూ.21 లక్షలు ఖాతాలు చేరతాయని అన్నారు. మరీ ఇప్పటికైనా క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వాహకులు తీరు మారుతుందో లేదో వేచి చూడాలి మరీ.