Begin typing your search above and press return to search.

ఏపీలో పని మొదలుపెట్టేసిన సునీల్ దేవధర్

By:  Tupaki Desk   |   2 Aug 2018 7:41 PM IST
ఏపీలో పని మొదలుపెట్టేసిన సునీల్ దేవధర్
X
సునీల్ దేవధర్... ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంఛార్జిగా మొన్నే నియమితులయ్యారు. ఎన్నికల్లో గెలవడం ఎలా అనే విషయంలో ప్రూవెన్ ట్రాక్ రికార్డాయనది. నియామకం జరిగిన కొద్దిరోజుల్లోనే ఆయన ఏపీలో ల్యాండ్ అయ్యారు. బుధవారం ఏపీ బీజేపీ నేతలను కలవడం.. కోర్ కమిటీ మీటింగ్‌ లో పాల్గొనడం అన్నీ పూర్తి చేశారు. అక్కడితో ఆపేస్తే ఆయన సునీల్ దేవధర్ ఎందుకవుతారు. బర్నింగ్ ఇష్యూని తీసుకుని ఫేస్ బుక్‌ లో తన పేజీలో పోస్ట్ చేశారు.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇటీవల విజయనగరం జిల్లాలో నిండు గర్భిణిని డోలీలో మోసుకెళ్లిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను పోస్ట్ చేసిన దేవధర్... రోడ్డు కనెక్టివిటీ లేదు.. అంబులెన్సు లేదు.. హాస్పిటల్ లేదు.. గిరిజన సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు అమరావతిని దాటి ఎప్పుడు ఇతర ప్రాంతాలను చూస్తుంది? అంటూ నేరుగా ప్రశ్నించారు.

త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన దేవధర్‌ కు ఏపీ వ్యవహారాలు అప్పగించడంతోనే చంద్రబాబుకు సెగ మొదలైందని అంతా అనుకున్నారు. ఇప్పుడు దేవధర్ ఇలా పోస్ట్ చేయడంతో ఇక చంద్రబాబుకు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మొదలవుతాయని అనుకుంటున్నారు. అంతేకాదు... సోషల్ మీడియా వేదికగా సునీల్ ఏపీలోని ప్రతి ఒక్కరినీ చేరుకుంటారని.. టీడీపీకి కష్టకాలమేనని అంటున్నారు.