Begin typing your search above and press return to search.

ఏడు కొండలవాడితో జగన్ పెట్టుకున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ముఖ్యుడు

By:  Tupaki Desk   |   20 April 2023 9:24 AM GMT
ఏడు కొండలవాడితో జగన్ పెట్టుకున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ముఖ్యుడు
X
బీజేపీ అధినాయకత్వంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాల గురించి.. దగ్గరతనం గురించి తెలిసిందే. మోడీషాలతో ఆయన వ్యవహరించే తీరు.. అనవసర వివాదాలకు చోటివ్వకుండా.. కేంద్రంతో సామరస్యంతో ముందుకు వెళుతున్న జగన్ మీద బీజేపీకిచెందిన కీలక నేత ఒకరు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉండటమే కాదు.. మిగిలిన వారికంటే భిన్నంగా ఎప్పుడు అపాయింట్ మెంట్ కావాలంటే అప్పుడు మోడీషాల టైం పొందే అతి కొద్దిమందిలో ముఖ్యమంత్రి జగన్ ఒకరుగా చెబుతారు. అలాంటి ఆయనపైనా.. ఆయన ప్రభుత్వం మీదా బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ చేసిన షాకింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వైసీపీ ప్రభుత్వంలో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఆయన.. తప్పు ఎవరు చేసినా జైలుశిక్ష అనుభవించక తప్పదన్నారు. వివేకా హత్య కేసులో జరుగుతున్నది ఇదేనన్నఆయన.. జగన్ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లక తప్పదన్న కీలక వ్యాఖ్య చేశారు.

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపతంగా పని చేస్తున్నారని.. వైసీపీ నేతలు సీబీఐను నిందించటం సరికాదన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే నిందితులను అరెస్టు చేస్తున్నట్లు చెప్పిన సునీల్.. ముఖ్యమంత్రి జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ ఉండదన్న ఆయన.. ఏపీకి జగన్ సీఎం కావటం అక్కడి ప్రజలు చేసుకు్న దౌర్భాగ్యమని పేర్కొనటం గమనార్హం. ఏడుకొండల వాడితో జగన్ పెట్టుకున్నారని.. వెంకటేశ్వరస్వామితోపెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదని వార్నింగ్ ఇచ్చారు. 'జగన్ నాశనమైపోతారు' అంటూ తీవ్రమైన వ్యాఖ్య ఆయన నోటి నుంచి రావటం సంచలనంగా మారింది.

టీటీడీలో అన్యమతస్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారన్నారు. కొద్ది రోజుల ముందు టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అదే జరగకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ ముఖ్యనేత నోటి నుంచి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు రావటం మింగుడుపడనిదిగా మారింది.