Begin typing your search above and press return to search.
సండే ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
By: Tupaki Desk | 29 Aug 2021 3:30 AM GMTహైదరాబాద్ మహానగరంలోని అద్భుత పర్యాటక ప్రదేశాల్లో ట్యాంక్ బండ్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, వీకెండ్ లో టాంక్ బండ్ పై సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై సందర్శకులు సౌకర్యం కోసం ట్రాఫిక్ మళ్లించాలని మంత్రి కేటీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పర్ ట్యాంక్ బండ్‌ను వీకెండ్ పిక్నిక్ స్పాట్‌గా మార్చే క్రమంలో ఆదివారం నాడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ అంజనీకుమార్ తాజాగా వెల్లడించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
ఆ సమయాల్లో లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి వాహనాలను అనుమతించరని అంజనీ కుమార్ తెలిపారు. అటుగా వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ వైపునకు దారి మళ్లించబోతున్నారని వెల్లడించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్ వైపునకు పంపుతారని తెలిపారు. కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ గుడి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపునకు డైవర్ట్ చేస్తారని అంజనీకుమార్ వెల్లడించారు. డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలను గోశాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్‌ల వైపునకు పంపుతారని, ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వైపునకు వెళ్లే వాహనాలను పాత సెక్రటేరియట్ వద్ద తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైనుంచి అనుమతిస్తారని చెప్పారు.
ఇక, ఆదివారం నాడు వాహనాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని చెప్పారు. ట్యాంక్‌బండ్ రోడ్‌పై ఇరువైపులా 200 మీటర్ల దూరం వరకు పార్కింగ్ కు అనుమతించామన్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌పై లేపాక్షి వరకు.., డాక్టర్ కార్స్ ప్రాంగణంలో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శనగర్. ఏపీ సెక్రటేరియట్ వద్ద, సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు, బుద్ద భవన్ వెనక నుంచి నెక్లెస్ రోడ్ వరకు, ఎన్‌టీఆర్ గ్రౌండ్స్ వద్ద సందర్శకుల వాహనాలకు పార్కింగ్ కేటాయించామని, ఆయా ప్రాంతాల్లో మాత్రమే సందర్శకులు తమ వాహనాలను నిలపాలని అంజనీ కుమార్ కోరారు.