Begin typing your search above and press return to search.

ఉద్యోగుల ఫ్రీడం పై సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   3 March 2022 12:30 AM GMT
ఉద్యోగుల ఫ్రీడం పై సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X
వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ పదం కరోనాకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కేవలం ఐటీ ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. అయితే కరోనా పుణ్యమా అని అందరికీ ఈ కల్చర్ వచ్చింది. పిల్లలు, ఐటీ ఉద్యోగస్తులు, మీడియా ఇలా అందరికీ ఇంటి నుంచి పని చేసే సదుపాయం కలిగింది.

అయితే ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య దిగజారుతోంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం ను రద్దు చేయాలని... ఉద్యోగులను కార్యాలయాలకు పలు సంస్థలు పిలుస్తున్నాయి. దీనిపై గూగుల్ సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఆఫీసులకు రావాలని సంస్థల నుంచి మెయిల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే గూగుల్... తమ ఉద్యోగులకు ఇంకా ఇంటి నుంచి పని వెసలు బాటును కల్పించింది. ఉద్యోగుల కోరిక మేరకు... కొందరికి వారంలో మూడు రోజులు ఆఫీసుకు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగులు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం కోసం ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనిపై సుందర్ పిచాయ్ సానుకూలంగా స్పందించారు.

ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. ఒత్తిడి లేకుండా పని చేస్తే... ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుందని తెలిపారు. గత రెండేళ్లుగా వారంతా పని ఒత్తిడితో ఉన్నారని పేర్కొన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉంటే పనిని సరిగా చేయలేరని అభిప్రాయపడ్డారు. అందుకే వారికి పూర్తిస్థాయి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇన్నోవేటివ్ గా పని చేస్తాయని స్పష్టం చేశారు. అందుకే గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఇంకా అమలు చేస్తోందని క్లారిటీ ఇచ్చారు.

సుందర్ పిచాయ్ మాటలు ఉద్యోగులకు చాలా నచ్చాయి. ఆయన అభిప్రాయం లో వంద శాతం నిజం ఉందని అంటున్నారు. ఉద్యోగులు ఒత్తిడి లేకుండా ఉంటేనే... బాగా పని చేస్తారని అంటున్నారు. అయితే దీనిపై మరికొన్ని సంస్థల అభిప్రాయం ఏంటో చూడాలి. ఆఫీసులకు రావాలని ఇప్పటికే మెయిల్ పంపిన సంస్థలు... తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయా? చూడాలి. ఈ నెలాఖరు లోగా ఆఫీసులకు రావాలంటూ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సందేశాలు పంపించడం గమనార్హం.