Begin typing your search above and press return to search.

ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే.. నన్నీ స్థాయికి చేర్చింది..: సుందర్ పిచాయ్

By:  Tupaki Desk   |   1 May 2023 11:27 AM GMT
ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే.. నన్నీ స్థాయికి చేర్చింది..: సుందర్ పిచాయ్
X
భారత గడ్డపై పుట్టిన చాలా మంది ప్రపంచ విజేతలుగా మారారు. వీరిలో సుందర్ పిచాయ్ ఒకరు. ప్రఖ్యాత గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగిన ఆయన ప్రతి భారతీయుడికి ఆదర్శం. సామాన్య కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. అందుకోసం ఎంతో కష్టపడాలి. అలాంటి కష్టాలెన్నో ఎదుర్కొన్న సుందర్ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఆయన ఇంతటి విజయం సాధించడానికి సొంత ప్రతిభతో పాటు ఇతరుల ప్రోత్సాహం కూడా ఉంది. ఆ ఇతరులు ఎవరో కాదు. ఆమె సతీమణి అంజలి. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలతోనే సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగారని ఆయన చెబుతున్నారు. ఇంకా తన సతీమణి గురించి ఏం చెబుతున్నారంటే?

తమిళనాడులోని మధురైలో సుందర్ పిచాయ్ జూన్ 10, 1972లో జన్మించారు. ప్రాథమిక విద్యనంతా చెన్నైలో పూర్తి చేవారు. ఆ తరువాత ఖరగ్ పూర్ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేవారు. ఆ తరువాత స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసి అమెరికాలోని వార్డన్ స్కూల్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశారు. చదువంతా పూర్తి చేసిన సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ లో చేరారు. 2019లో గూగుల్ సీఈవో అయ్యారు.

సుందర్ పిచాయ్ ఐఐటీ చదువుతున్నప్పుడే అంజలి పరిచయం అయింది. వీరిద్దరు కలిసి ఖరగ్ పూర్ లో ఐఐటీ పూర్తి చేశారు. ఈ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత నిశ్చితార్థ: చేసుకున్నారు. ఆ తరువాత సుందర్ పిచాయ్ మాస్టర్స్ కోసం అమెరికాకు వెళ్లారు.

ఈ క్రమంలో మిగతా వాళ్ల లాగా వీరు మాట్లాడుకోలేదు. దీనికి కారణం లేకపోలేదు. అమెరికా వెళ్లిన సుందర్ పిచాయ్ చేతిలో డబ్బులేని కారణంగా డబ్బును పొదుపుగా వాడారు. ఫోన్ చేస్తే ఖర్చు అవుతుందని భయపడి చేయలేదు.

సుందర పిచాయ్ గూగుల్ లో ఉద్యోగం సంపాదించిన తరువాత అంజలి అతనికి విలువైన సలహాలు ఇస్తూ ఉండేది. తన ప్రతిభను గుర్తించి యాహూ, ట్విటర్ వంటి సంస్థలు అత్యధిక ఆఫర్లు చేవాయి. ఈ సమయంలో ఆయన గూగుల్ ను వదిలేయాలని అనుకున్నారు. కానీ అంజలి మాత్రం గూగుల్ ను వదలొద్దని సలహా ఇచ్చింది. అప్పటి ఆ నిర్ణయమే ఇప్పుడు అతడిని గూగుల్ సీఈవో స్థాయికి నిలబెట్టింది. అంజలిలో స్వతంత్ర భావాలు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా నచ్చుతుందని సుందర్ పిచాయ్ చెబుతున్నారు.

ఓ వైపు వర్క్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచిస్తూనే.. మరోవైపు సేవాగుణం అంజలిలో ఉందని సుందర్ పిచాయ్ చెబుతున్నారు.కరోనా సమయంలో కొవిడ్ బాధితులకు రూ.1.20 కోట్లు ఆలోచన అందరినీ కదిలించింది. అలాగే పేద పిల్లల చదువు కోసం సాయం చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఉన్నత చదువులు చదివినా సామాన్యుల కష్టాలను తెలుసుకోవడం అంజలి మందుంటారని సందర్ చెబుతున్నారు.