Begin typing your search above and press return to search.
అందరినీ తొలగించి.. కోతలేసి.. 1850 కోట్ల వేతనం తీసుకున్న గూగుల్ సీఈవో
By: Tupaki Desk | 22 April 2023 12:45 PM GMTఓవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు. మరోవైపు ఐటీ ఉద్యోగులందరినీ తీసేస్తున్నారు. ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే వేలమందికి ఉద్వాసన పలికింది. ఆదాయం లేదు.. నష్టాలు అంటూ ఇంకా తీసేస్తోంది. ఇంతటి సంక్షోభ సమయాన ఎవరైనా ఏం చేస్తారు..? నష్టనివారణ చర్యలు చేపడుతారు. కానీ గూగుల్ సంస్థ మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వేతనం చూసి అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లో ఉద్యోగాల కోతలు భారీగా సాగుతున్న వేళ.. ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మాత్రం 2022లో దాదాపు $226 మిలియన్ల (రూ.1850 కోట్లకు పైగానే) భారీ పారితోషికాన్ని అందుకోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. కంపెనీలో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే ఇది 800 రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఈ పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు ఉన్నాయి.
టెక్ దిగ్గజం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (ఎస్.ఈసీ)కి దాఖలు చేసిన వివరాల ప్రకారం, పిచాయా పరిహారంలో సుమారు $218 మిలియన్ల స్టాక్ అవార్డులు ఉన్నాయి. అయితే నివేదికల ప్రకారం పిచాయ్ జీతం గత మూడేళ్లుగా $2 మిలియన్ల వద్ద స్థిరంగా ఉంది.
జనవరి 20న, గూగుల్ సీఈవో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 మందిని తొలగించారు. మొత్తం శ్రామిక శక్తిలో ఈ తీసేసిన వారి సంఖ్య 6 శాతానికి పైగా ఉంది.
తొలగింపుల మధ్య టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రస్తుత ఉద్యోగులకు ఉచిత స్నాక్స్ , వర్కౌట్ తరగతులను తగ్గించడం వంటి అనేక ఖర్చుతగ్గింపు చర్యలను కూడా చేపట్టింది. తృణధాన్యాలు, ఎస్ప్రెస్సో , సెల్ట్జర్ వాటర్ వంటి ఉచిత స్నాక్స్ అందించే మైక్రో కిచెన్ సేవలను మూసివేసింది. కంపెనీ ల్యాప్‌టాప్‌ల వంటి వ్యక్తిగత పరికరాలపై ఖర్చు చేయడం కూడా నిలిపివేసింది.
టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు గతంతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ మంది సీనియర్ స్థాయిలకు పదోన్నతి కల్పించింది. గూగుల్ ఇండియా 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. కొంతమంది బాధిత ఉద్యోగులు తమ దుస్థితిని లింక్డ్‌ఇన్ లో పంచుకొని బాధపడ్డారు.
ఇంత మందిని తీసేసి ఖర్చు తగ్గింపులు చేపట్టిన గూగుల్ కంపెనీ తమ సీఈవో సుందర్ పిచాయ్ కు మాత్రం భారీగా పారితోషికం ఇవ్వడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే లండన్ కార్యాలయంలో గూగుల్ కంపెనీ తీరుపై ఉద్యోగులు వాకౌట్ చేశారు. మార్చిలో జ్యూరిచ్ ఆఫీసుల్లోనూ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇది ఎటువైపు దారితీస్తుందన్నది వేచిచూడాలి.