Begin typing your search above and press return to search.

ఆ మాజీ మంత్రి గర్ల్ ఫ్రెండ్ ను విచారించారట

By:  Tupaki Desk   |   18 July 2016 10:41 AM GMT
ఆ మాజీ మంత్రి గర్ల్ ఫ్రెండ్ ను విచారించారట
X
మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ప్రేమ భాగోతాలు చాలా ఫేమస్ అన్నది తెలిసిందే. సునందా పుష్కర్ ను ప్రేమించి పెళ్లాడిన వైనం.. ఆమె కారణంగా తన మంత్రి పదవిని సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడటం లాంటివి అప్పట్లో పెద్ద చర్చకే తెర తీశాయి. అనంతరకాలంలో అంత ప్రేమించి పెళ్లాడిన సునందా పుష్కర్ అనుమానాస్పద రీతిలో మరణించటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పలు కొత్త విషయాలు తెర మీదకు వచ్చాయి. సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పాక్ కు చెందిన రచయిత్రి.. శశి థరూర్ గర్ల్ ఫ్రెండ్ గా చెబుతున్న మొహర్ తరార్ పాత్రపై పలు సందేహాలు ఉన్నాయి. తాజాగా ఆమెను సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం బయటకు వచ్చింది. సునంద పుష్కర్ తో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అన్న కోణంలో ప్రశ్నలు సంధించగా.. తనకు అలాంటి ఇబ్బందులు లేవని చెప్పినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో శశిథరూర్ తో తనకు సాన్నిహిత్యం లేదని ఆమె వెల్లడించినట్లుగా సమాచారం. ఆయనతో తనకు సంబంధం ఉందన్నది ఉత్త అపోహగా కొట్టేసినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ విచారణకు సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పటికి బయటకు వస్తుందో..?