Begin typing your search above and press return to search.

స‌న్ రైజ‌ర్స్ ఫెయిల్యూర్‌ అక్క‌డే.. బ్లండర్ మిస్టేక్!

By:  Tupaki Desk   |   19 April 2021 11:38 AM GMT
స‌న్ రైజ‌ర్స్ ఫెయిల్యూర్‌ అక్క‌డే.. బ్లండర్ మిస్టేక్!
X
ఐపీఎల్-14 సీజ‌న్ ను ఓట‌మితో మొద‌లు పెట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.. ప‌రాజ‌యాల‌ను కంటిన్యూ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు మ్యాచ్‌లు ఆడిన SRH టీమ్‌.. హ్యాట్రిక్ డిఫీట్ న‌మోదు చేసింది. దీంతో.. అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అంతేకాదు.. లోపం ఎక్క‌డ జ‌రిగిందో త‌వ్వితీస్తున్నారు. చివ‌ర‌కు కార‌ణాన్ని ప‌సిగ‌ట్టి, క‌నిపెట్టి.. బ్లండ్ మిస్టేక్ అక్క‌డే జ‌రిగింద‌ని ఎత్తిచూపుతున్నారు. ‌

ఈ సీజ‌న్ వేలంలోనే ఈ ఫెయిల్యూర్ కు పునాది ప‌డింద‌న్న‌ది అభిమానుల ప్ర‌ధాన అభియోగం. స‌రైన ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవ‌డంలో యాజ‌మాన్యం త‌ప్పు చేసిందంటున్న ఫ్యాన్స్‌.. అది ఎలాగో కూడా నిరూపిస్తున్నారు. ఈ సీజ‌న్లో ఖ‌ర్చు చేయ‌డానికి యాజ‌మాన్యానికి 10.75 కోట్ల వ‌ర‌కు అనుమ‌తి ఉంది. కానీ.. కేవ‌లం 3.80 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది.

ఈ డబ్బు చెల్లించి.. కేదార్ జాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జగదీష్ సుచిత్ ను జట్టులోకి తీసుకుంది. కేదార్ జాదవ్‌కు 2 కోట్లు, ముజీబ్ కు 1.5 కోట్లు, సుచిత్‌కు 30 లక్షల రూపాయలు చెల్లిస్తోంది. ఇక్క‌డే ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. డ‌బ్బులు చెల్లించ‌డానికి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. పిసినారిత‌నం చేయ‌డం ఎందుక‌ని అంటున్నారు‌. మరి‌న్ని డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తే మంచి ఆట‌గాళ్లు వ‌చ్చేవాళ్లు క‌దా అన్న‌ది వారి ఆవేద‌న‌కు కార‌ణం.

ఇక మ‌రో రీజ‌న్‌ ఏమంటే.. కేదర్ జాదవ్ గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ కార‌ణంతోనే సీఎస్కే జ‌ట్టు అతన్ని వ‌దులుకుంది. అలాంటి ఆట‌గాన్ని ఎలా తీసుకున్నారు అని అడుగుతున్నారు. స‌రే.. ఏదో కార‌ణంతో కొన్నారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు మ్యాచుల్లోనూ అత‌న్ని బెంచ్ కే ప‌రిమితం చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న‌ది వారి మ‌రో ప్ర‌శ్న‌.

ఇక‌, SRH ప్ర‌ధాన స‌మ‌స్య మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం. దాన్ని స‌రిదిద్ద‌కుండా బండి న‌డిపిస్తున్నార‌ని కంప్లైంట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మనీష్ పాండే, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్ త‌దిత‌రులు.. మిడిల్ ఆర్డర్ బాధ్య‌త‌లు తీసుకోవ‌ట్లేద‌ని గుర్రుగా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. కేన్ విలియమ్సన్ ను వెంట‌నే రంగంలోకి దించాల‌ని కోరుతున్నారు ఫ్యాన్స్‌. అయితే.. అత‌ను ఫిట్‌నెస్ నిరూపించుకోలేద‌ని చెబుతోంది యాజమాన్యం.

జ‌ట్టుకు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చినందుకు యాజ‌మాన్యం క‌న్నా ఎక్కువ‌గా బాధ‌ప‌డుతున్న ఫ్యాన్స్‌.. ‘అంతా మీరే చేశారు’ అంటూ జట్టు నిర్వాహకులను నిందిస్తున్నారు. వేలంలో మీరు అలా చేసి ఉండ‌క‌పోతే.. నేడు ఇలా జ‌రిగేది కాద‌ని ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు. మ‌రి, దీనికి యాజ‌మాన్యం ఏం చెబుతుందో..?