Begin typing your search above and press return to search.

షాకింగ్ : మహమ్మారితో సుమో రెజ్ల‌ర్ మృతి !

By:  Tupaki Desk   |   14 May 2020 6:00 AM GMT
షాకింగ్ : మహమ్మారితో సుమో రెజ్ల‌ర్ మృతి !
X
జ‌పాన్‌ కు చెందిన 28 ఏళ్ల సుమో రెజ్ల‌ర్‌..ఈ వైర‌స్ ‌తో ప్రాణాలు విడిచాడు. వైర‌స్ వ‌ల్ల సుమో రెజ్ల‌ర్ ‌ చ‌నిపోవ‌డం ఇదే తొలి ఘ‌ట‌న‌. జ‌పాన్ సుమో సంఘం ఈ విష‌యాన్ని చెప్పింది. రెజ్ల‌ర్ షోబుషి అస‌లు పేరు కియోట‌కా సుటేకా. జ‌పాన్ సుమో సంఘం ఈ విష‌యాన్ని దృవీకరించింది. అకియోట‌కా సుటేకా నెల రోజుల క్రితం అత‌ను హాస్పిట‌ల్‌లో చేరాడు. టోక్యో హాస్పిట‌ల్ ‌లో అత‌ను మృతిచెందిన‌ట్లు జ‌పాన్ మీడియా తెలిపింది. 2007లో షోబుషి ప్రొఫెష‌న‌ల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు.

అతడు తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత‌ను 11వ స్థానంలో నిలిచాడు. ఏప్రిల్‌ లో అయిదుగురు సుమో రెజ్ల‌ర‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు సంఘం తెలిపింది. మ‌హ‌మ్మారి వ‌ల్ల మే 24వ తేదీ నుంచి టోక్యోలో జ‌రిగాల్సిన సుమో రెజ్లింగ్ పోటీల‌ను కూడా వాయిదా వేశారు. జ‌పాన్ ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 16,759 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. 691 మంది మ‌ర‌ణించారు. అకియోట‌కా సుటేకాకు కరోనా సోకినా ఏమాత్రం భయ పడలేదు. కానీ ఫలితం లేకపోయింది. ఏనుగులాంటి అకియోట‌కా సుటేకా బలం వైరస్ శక్తిముందు ఓడిపోయింది. అకియోట‌కా సుటేకా వైరస్ కు ప్రాణాలు కోల్పోయాడు.