Begin typing your search above and press return to search.

దొంగతనాలపై సమ్మర్ క్లాసులు.. ఇదేందయ్యా ప్రొఫెసర్

By:  Tupaki Desk   |   28 April 2023 8:00 AM GMT
దొంగతనాలపై సమ్మర్ క్లాసులు.. ఇదేందయ్యా ప్రొఫెసర్
X
అతడు ఒక ప్రొఫెసర్.. తెలివి బాగా ఉంది. అయితే ఆ తెలివిని విద్యార్థులకు పంచాల్సిన ఆ ఆచార్యుడు పక్కదారి పట్టాడు. దొంగతనాలపై సమ్మర్ క్లాసులు స్ట్రాట్ చేశాడు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజంగా నిజం. ఈ దేశంలో ఏదైనా కూడా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన తన ఇంట్లో ట్యూషన్లు చెబుతున్నారు. అయితే ఏదో విద్యాబుద్దులు చెబుతున్నాడని అందరూ అనుకున్నారు. లోకం తెలిసిన బడా ప్రొఫెసర్ కావడంతోనే ఆయన వద్దకు ట్యూషన్లు చెప్పించుకునేందుకు వచ్చారు. అయితే ఆయన ట్యూషన్లు చెప్పేది ఎవరికో తెలుసా? దొంగలకు.. షాకింగ్ విషయం ఇదీ..

ఈ బెంగాల్ ప్రొఫెసర్ చెప్పే సబ్జెక్ట్ ‘దొంగతనం ఎలా చేయాలి?’ అనే విషయాన్ని పక్కగా నూరి పోస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగలను ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకొని దొంగతనాలు చేయడం.. పోలీసులకు దొరికి పోకుండా బయటపడడం.. ఎప్పటికీ అంతుచిక్కకుండా వ్యవహరించడం.. అనే మూడు కాన్సెప్టులపై ఆయన ఇస్తున్న లెక్చరర్లు పోలీసుల ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యం గొలుపుతున్నాయి.

ఈ ప్రొఫెసర్ గారి పాఠాలు విన్నాక ట్యూషన్ కు వచ్చిన యువత దొంగతనాలు బాట పట్టారంటే అతిశయోక్తి కాదు. నిజంగానే ప్రొఫెసర్ పదుల సంఖ్యలో యువత దొంగతనాలు చేశారని తేలింది. ఇటీవల బీహార్ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం జరిగింది. డబ్బులు పోతే బాధపడేవారు కాదు.. నగలు పోయినా.. ఇబ్బంది ఉండేది కాదు.. కానీ సదురు ఎమ్మెల్యే పదోతరగతి సర్టిఫికెట్ దొంగలు దోచుకెళ్లారు. ఆ సర్టిఫికెట్ తోనే ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతోనే.. దాన్ని సీరియస్ గా తీసుకొని కంప్లైంట్ ఇచ్చి.. ఫాలో అప్ చేశారు. ఈ క్రమంలో దొరికిన దొంగలను పోలీసులు విచారించారు.

దీంతో ఈ ప్రొఫెసర్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆయన చోర కళ మెళకువలను తెలుసుకున్నాక.. ఇప్పుడు పోలీసులే ఈ ప్రొఫెసర్ ట్యూషన్లను చూసి ఆశ్చర్యపోతున్నారు.