Begin typing your search above and press return to search.

సుమేధ మృతి: కేటీఆర్ పై ఆమె తండ్రి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   21 Sept 2020 11:05 PM IST
సుమేధ మృతి: కేటీఆర్ పై ఆమె తండ్రి ఫిర్యాదు
X
నేరేడ్ మెట్ లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలిక సుమేధ మరణం యావత్ తెలుగు రాష్ట్రాలను కలిచివేసింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు సుమేధ నాలాలో పడి కొట్టుకుపోయిన మరణించడం కలిచివేసింది. బండ చెరువులో శవమై తేలింది. నాలాలా పడి ఆమె మరణించింది.

హైదరాబాదులోని నేరేడుమెట్ కాకతీయ నగర్ లో సుమేధ కపూరియా అనే బాలిక . గురువారం నాడు సాయంత్రం సైకిల్ మీద బయటకు వెళ్లింది.బయటకు వెళ్లిన సుమేధ ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత భారీ వర్షం కురిసింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో తల్లి ఇంట్లో లేదు. తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూతురి కోసం గాలించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతకగా బండ చెరువులో శవమై తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులు జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ధ్వజమెత్తారు.

తమ కూతురు నాలాలో పడి మరణించిన ఘటనపై సుమేధ తల్లిదండ్రులు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ మీద వారు నేరేడుమెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేటీఆర్ మీదనే కాకుండా జీహెచ్ఎంసి కమిషర్, జోనల్ కమిషనర్ మీద కూడా వారు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు స్థానిక కార్పోరేటర్ మీద, సంబంధిత డీఈ, ఏఈల మీద కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారందరిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని వారు కోరారు.