Begin typing your search above and press return to search.
భార్యను కలవనివ్వాలని జైలులో సుఖేష్ నిరాహార దీక్ష
By: Tupaki Desk | 12 Jun 2022 5:30 AM GMTతీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి నిరాహార దీక్ష చేపట్టాడు. అదే జైలులో ఖైదీగా ఉన్న తన భార్య లీనా మారియా పాల్ ను ప్రతివారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సుఖేష్ నిరాహార దీక్ష చేస్తున్నాడు.
గతంలోనే ఇలానే భార్య కోసం భోజనం మానేసిన సుఖేష్ .. మే 23వ తేదీ నుంచి మళ్లీ నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాడు. దీంతో అధికారులు అతడికి గ్లూకోజ్ లు అందిస్తున్నారు. తీహార్ జైలు డైరెక్టర్ మాట్లాడుతూ అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న చంద్రశేఖర్ మొదట ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకూ.. మళ్లీ మే 4 నుంచి మే 12 వరకూ ఆహారం తీసుకోలేదని తెలిపారు.ఆ సమయంలో అతడికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ లు అందించామన్నారు. మే 12 నుంచి సుకేష్ లిక్విడ్ డైట్ తీసుకుంటున్నాడని.. కానీ మే 23 నుంచి మళ్లీ ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని పేర్కొన్నాడు.దీంతో జైలు ఆస్పత్రిలోనే అతడికి గ్లూకోజ్ లు అందిస్తున్నట్టు తెలిపారు.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేష్ గత నాలుగు నెలలుగా తీహార్ జైలులో శిో అనుభవిస్తున్నారు.
ప్రస్తుతం అదే జైలులో అతడి భార్య లీనా ఖైదీగా ఉన్నారు. సుఖేష్ అభ్యర్థన మేరకు నెలలో రెండు సార్లు భార్యను కలిసేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఎక్కువ సార్లు ములాఖత్ కు అనుమతించాలని సుఖేష్ డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.