Begin typing your search above and press return to search.
తీహార్ లోకి కవిత, కేజ్రీవాల్ కు స్వాగతం : సుఖేష్ చంద్రశేఖర్
By: Tupaki Desk | 15 April 2023 11:43 PM GMTఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత విచారణ ఎదుర్కొంటుండగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఆదివారం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్న వేళ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ ఈ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే కవితతో తాను వాట్సాప్ చాట్ చేసినట్టుగా ఆరోపిస్తూ పలు స్క్రీన్ షాట్లను విడుదల చేసి దుమారం రేపారు. ఈ చాట్ లు నకిలీవి అని.. సుఖేష్ తో తనకు సంబంధం లేదంటూ కవిత ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఈ వివాదం ఇంకా సద్దుమణకముందే మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. సుఖేష్ స్క్రీన్ సాట్లను కవిత ఖండించి బీజేపీ కుట్ర అంటూ ఆరోపించడంతో దానికి సమాధానంగా మరో లేఖ విడుదల చేశారు. ఐదు పేజీలతో దీన్ని రిలీజ్ చేశాడు. తాను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితతోనే అని ఫోన్ నంబర్స్ తో సహా మరికొన్ని షాట్స్ రిలీజ్ చేశాడు.
సుఖేష్ లేఖ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచింది. ‘నన్ను దొంగ, ఆర్థిక నేరగాడు అని విమర్శించారు. కానీ అందులో మీరు భాగస్వాములే’ అని కవిత కౌంటర్ ఇచ్చారు. కవితను తాను కవితక్క అని పిలుస్తానని.. ఆమెను తన పెద్దక్కగా భావించానని.. తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలనే ఈ వాస్తవాలను బయటపెడుతున్నా అని అన్నారు.
తెలుగులో చాట్ చేసినందుకు అనుమానం వ్యక్తం చేశారని కానీ తెలుగు , తమిళం, తన మాతృభాషలు అని ఇంకా అనేక భాషలు మాట్లాడగలనని క్లారిటీ ఇచ్చారు. దమ్ము, దైర్యం ఉంటే తన ఆరోపణలపై జరిగే విచారణకు సహకరించాలంటూ సవాల్ విసిరారు.
తీహార్ జైలు క్లబ్ కు కవిత, కేజ్రీవాల్ కు స్వాగతమంటూ లేఖలో కవిత వార్నింగ్ ఇచ్చారు. ముందు కేజ్రీవాల్ ఆ తర్వాత నీ వంతే అంటూ కవితకు లేఖలో హెచ్చరికలు చేశాడు సుఖేష్.
కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో సుఖేష్ రాసిన లేఖ సంచలనమైంది. రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అంటూ ఆప్, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలపై హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా ఈ డబ్బులు అందజేసినట్టుగా ఇదివరకు రాసిన లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు.
మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్నాడు సుఖేష్ చంద్రశేఖర్. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ ఆప్, బీఆర్ఎస్ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.