Begin typing your search above and press return to search.

త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన బీజేపీ నాకు విడాకులిప్పిస్తోందా: సుజాతాఖాన్

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:47 AM GMT
త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన బీజేపీ నాకు విడాకులిప్పిస్తోందా: సుజాతాఖాన్
X
బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైరం అనోన్యంగా సాగుతున్న ఓ బీజేపీ ఎంపీ సంసారంలో నిప్పులు పోసింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ తన భార్య అయిన సుజాతాఖాన్ కు తాజాగా విడాకులు ఇవ్వడం సంచలనమైన సంగతి తెలిసిందే. బీజేపీని వీడి తృణమూల్ లో చేరిన భార్యకు ఈ బీజేపీ ఎంపీ విడాకుల నోటీసులు పంపడం సంచలనమైంది.

ఎంపీ సౌమిత్ర ఖాన్ నిర్ణయంపై ఆయన భార్య సుజాత తాజాగా మీడియాతో స్పందించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఓ పార్టీయే (బీజేపీ) నాకు విడాకులివ్వాలని నా భర్తను కోరుతోంది అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది. నా పేరులో తన ఇంటిపేరును తొలగించాలని సౌమిత్రా ఖాన్ కోరాడని, నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు ఇస్తానని హెచ్ఛరించాడని ఆమె అన్నారు.

బీజేపీకి చెందిన ‘చెడ్డ నేతలతో’ సౌమిత్రా ఖాన్ కూడా కలిసిపోయారని సుజాతా ఖాన్ పేర్కొన్నారు. తన భర్తను బీజేపీ నేతలే రెచ్ఛగొడుతున్నారని సుజాతా ఆరోపించారు. వారిలో ఒక్కరైనా ఆయనను ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ఇది మంచిది కాదని ఆయనకు ఎందుకు నచ్ఛజెప్పడం లేదన్నారు.

బీజేపీ ఎంపీ విడాకులు ఇచ్చినా.. సుజాతా తమ పార్టీలో చేరినా కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై స్పందించలేదు. బీజేపీ ఇదంతా డ్రామాగా అభివర్ణిస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడి మీడియా రచ్చ రచ్చ చేస్తోంది.