Begin typing your search above and press return to search.
బీజేపీ అధిష్టానంతో పవన్ కల్యాణ్ చర్చలు వీటిపైనే!
By: Tupaki Desk | 1 Jun 2023 4:00 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తుల పై భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ, బీజేపీల మధ్య రాష్ట్రంలో పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీ ను కూడా తమతో కలుపుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే తన మనసులో మాటను చెప్పేశారు.
ఈ నేపథ్యంలో పొత్తుల పై కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల పై బీజేపీ అధిష్ఠానంతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయని సుజనా గుర్తు చేశారు. తమ అధిష్ఠానం ఏం చెబితే మేం అలాగే ముందుకెళ్తామని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని సుజనా గుర్తు చేశారు. ఈ విషయం పై ఎవరు చర్చకు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ తొమ్మిదేళ్లలో నవభారత్ ఆవిష్కృతమైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో కలిసి మోదీ పాలనపై కరపత్రాల ను విజయవాడలో సుజనా చౌదరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సుజనా చౌదరి.. ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను మోదీ అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఎయిమ్స్, అనేక విద్యా సంస్థలు, జాతీయ రహదారులు ఇచ్చారని వెల్లడించారు.
రాష్ట్రంలో అసమర్థ పాలన వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదని సుజనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా సీఎం జగన్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మోదీ నిధులిచ్చినా 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రగతిని జగన్ ప్రభుత్వం ఆపేసిందని సుజనా నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీ నేడు పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. భారతదేశం నుంచే ఇతర దేశాల కు కోవిడ్ వ్యాక్సిన్ సరపరా చేశామన్నారు. జనాభాలో చైనా ను భారతదేశం మించి పోయిందన్నారు. అయినా కోవిడ్ సమయంలో ప్రాణ నష్టం చాలా వరకు నివారించారని గుర్తు చేశారు.
సుజనా వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తు ఖాయమనే తెలుస్తోంది. అయితే టీడీపీ ని కలుపుకుంటారా, లేదా అనేదాని పై సుజనా స్పష్టత ఇవ్వలేదు. సునీల్ ధియోధర్ వంటి నేతలు సైతం జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని టీడీపీతో తమ పొత్తు ఉండబోదని అంటున్నారు. ఇప్పుడు సుజనా కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.