Begin typing your search above and press return to search.

సమన్ల లెక్క అడిగితే మోడీ మాటెందుకు సుజనా?

By:  Tupaki Desk   |   22 Feb 2016 10:09 PM IST
సమన్ల లెక్క అడిగితే మోడీ మాటెందుకు సుజనా?
X
నిబంధనలకు విరుద్ధంగా మారిషస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న కేంద్రమంత్రి సుజనాకు చెందిన కంపెనీ ఇష్యూలో ఆయనకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. మార్చి ఐదున విచారణలో భాగంగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన సుజనా తాజాగా చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. సుజనా కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి.

సంబంధం లేనప్పుడు.. కోర్టు నుంచి సమన్లు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు ఆయన వెరైటీగా సమాధానం ఇచ్చారు. సమన్లు తనకే కాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా వస్తాయంటూ వ్యాఖ్యానించారు. ఆరోపణలు వస్తే సదరు కంపెనీనే అడగాలన్న సుజనా మాట విన్న వారంతా అవాక్కు అవుతున్న పరిస్థితి. సుజనాకు వచ్చిన సమన్ల గురించి అడిగితే.. ఏకంగా ప్రధానమంత్రి మోడీ ప్రస్తావన తీసుకురావటం ఏమిటో ఆయనకే తెలియాలి. చూస్తుంటే.. ఎప్పుడు.. ఏ విషయంలో మోడీ ప్రస్తావన తీసుకురావాలో కేంద్రమంత్రి హోదాలో ఉన్న సుజనా మర్చిపోయినట్లున్నారు.