Begin typing your search above and press return to search.

అసలు సీక్రెట్‌ ఇప్పుడు చెప్పిన సుజనా!

By:  Tupaki Desk   |   11 Sep 2016 4:40 PM GMT
అసలు సీక్రెట్‌ ఇప్పుడు చెప్పిన సుజనా!
X
ఇంతకూ మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు రాలేదో ఎవరికైనా వాస్తవ కారణాలు తెలుసా? వెంకయ్యనాయుడు చేతకాని వాడని... కొంతమంది - చంద్రబాబునాయుడు తన మంత్రులతో రాజీనామా చేయించకపోవడం వల్ల రావడం లేదని, వైఎస్‌ జగన్‌ - మోదీ మోసకారి కావడం వల్ల అని కొంతమంది - రాష్ట్రంలో ఉండే ఎంపీలంతా రాజీనామాలు చేస్తే.. హోదా వస్తుందని పవన్‌ కల్యాణ్‌ ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు కదా.. అయితే అసలు సీక్రెట్‌ ఇప్పుడు తెలుస్తోంది. ప్రత్యేకహోదా రావడం కేంద్రమంత్రి సుజనా చౌదరికి వ్యక్తిగతంగా ఇష్టం లేదుట. హోదా వస్తే రాష్ట్రం నష్టపోతుందని ఆయన వ్యక్తిగత అభిప్రాయం అట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆదివారం నాడు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వెల్లడించారు.

అయిదుకోట్ల మంది తెలుగు ప్రజల అభిప్రాయం కంటె తన సొంత అభిప్రాయం గొప్పదని అనుకునే ఒక నాయకుడిని.. కేంద్రంలో మంత్రిని చేసి.. సర్కారుతో చర్చలు జరిపి ప్యాకేజీ సాధించే పనిలో పెట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు అని జనం అనుకుంటున్నారు.

రాష్ట్రమంతా జనం హోదా రాకపోవడం గురించి తాము నష్టపోతున్నామని గగ్గోలెత్తిపోతూ ఉంటే.. అసలు కేంద్రంతో మాట్లాడుతూ అరుణ్‌ జైట్లీతో కొన్ని రోజుల తరబడి చర్చలు జరిపి.. ప్యాకేజీ కి రూపకల్పన చేసిన సుజనా చౌదరి చివరికి వెల్లడించిన సీక్రెట్‌ ఇదీ! ఆయన వ్యక్తిగతంగా హోదా వల్ల నష్టం జరుగుతుందని తెలుసునట.

అయినా హోదా వల్ల పరిశ్రమలు వస్తాయి ప్రజలకు మేలు జరుగుతుంది, ప్యాకేజీ వల్ల కాంట్రాక్టర్లకు దళారీలకు మేలు జరుగుతుంది అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలినుంచి జనానికి వివరించి చెబుతోంది. మరి సుజనా చౌదరి తనను తాను ఏ కేటగిరీలో చూసుకోవడానికి ఇష్టపడతారో గానీ.. మొత్తానికి పరోక్షంగా హోదా రాకపోవడానికి తానే కారణం అనే సంకేతాలను ఆయన ప్రజలకు అందించారని జనం అనుకుంటున్నారు.