Begin typing your search above and press return to search.
టీడీపీ - వైసీపీ ఆందోళన చేస్తే ఆగదు: స్టీల్ ప్లాంట్ పై సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 5 Feb 2021 1:06 PM GMTవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నామని ఇక టీడీపీ,వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఇది ఆగదని అన్నారు. ప్లాంట్ వేరే దేశానికి తీసుకెళ్ళేది కాదన్న ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం త్యాగం చేసిన అందరిని గుర్తు చేసుకోవాలని అన్నారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది.
దీనిపై రాజకీయ..కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. స్ట్రాటజిక్ సేల్ నిర్ణయం తిప్పికొట్టేందుకు ఆందోళనలకు దిగుతున్నాయి. మహా ధర్నా చేపట్టిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా కోసం వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ప్రాణాలు ఇచ్చయినా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని చెబుతున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి నిరాహారదీక్షలు, రాజీనామాలకు వెనుకాడబోమని ప్రకటించారు ఎంపీలు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలను అడ్డగించేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపేశారు.