Begin typing your search above and press return to search.
సూట్ కేసు పట్టుకెళ్లినా.. చొక్కా తీసి నడిచినా.. ఫైన్ పక్కా!
By: Tupaki Desk | 2 July 2023 6:00 AM GMTఈ మధ్యకాలంలో రకరకాల బ్యాగ్ లు వచ్చేశాయి కానీ... సాధారణంగా అప్పట్లోని ప్రయాణాల్లో సూట్ కేసులో ప్రధానపాత్ర పోషించేవి! ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవడం.. ఆ తర్వాత వెంటతీసుకెళ్లబోయే వస్తువులను సూట్ కేసులో సర్దిపెట్టుకోవడం చేస్తుంటారు. అయితే తమ ప్రాంతంలో పర్యటనకు వస్తే మాత్రం సూటుకేసులు తీసుకురావొద్దని.. అది పూర్తిగా నిషేదం అని అంటుంది యూరప్ లోని ఒక నగరం.
యూరప్ లోని క్రోయేషియాలో డుబ్రోవ్నిక్ అనే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మాత్రం సూట్‌కేసును పక్కన పెట్టాల్సిందే! లేకపోతే జరిమానా కట్టాల్సిందే! కారణం... అక్కడ సూట్ కేసులు ఉపయోగించడం నిషేధం. అవును... డుబ్రోవ్నిక్ అనే పర్యాటక నగరానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానులు, అందమైన సూర్యోదయాన్ని చూడాలనుకునే పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఇదే సమయంలో ఈ ప్రాంతం మధ్యయుగ కాలం నాటి ఇటుకలు, అందమైన రాళ్లతో నిర్మించిన కట్టడాలకు ప్రసిద్ధి. అయితే ఇటీవల ఇక్కడి ప్రభుత్వం సూట్ కేసులపై నిషేధం విధించింది. ఎందుకబ్బా అని బుర్ర పాడుచేసుకోకండి... ఆ నిషేధం వెనక ఒక ఆశ్చర్యకరమైన కారణమే ఉంది.
అదేమిటంటే... ఈ నగరాంకి వచ్చే ర్యాటకులు అన్ని ప్రదేశాలను సందర్శిస్తూ తమ వెంట తెచ్చుకున్న సూట్ కేసులను రోడ్లపై తీసుకువెళుతుంటే శబ్ద కాలుష్యం ఎక్కువవుతుందట.
అవును... ఇలా వేల మంది నిత్యం సూట్ కేసులు అలా రోడ్లపై తీసుకెళ్లడం వల్ల శబ్ధ కాలుష్యం అవుతుందని అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. దీంతో అధికారులు ఈ సూట్ కేసుల ను నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్నారట. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే 380 డాలర్ల (సుమారు 31వేల రూపాయలు) జరిమానా కూడా విధిస్తారట.
అయితే ఈ విషయం తెలియకో.. మరో ఆప్షన్ లేకో ఎవరైనా సూటుకేసులతో ఈ నగరంలో దిగితే వారికి ఒక ఆల్టర్ నేటివ్ అరేంజ్ చేశారు అధికారులు. అందులో భాగంగా... సూట్ కేసులను భద్రపరిచేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.
కాకపోతే దానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదండోయ్... పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయడం, చొక్కా లేకుండా రోడ్లపై తిరగడం, స్మారక చిహ్నాలపై ఎక్కడం కూడా పూర్తిగా నిషేదం!!