Begin typing your search above and press return to search.
విషాదం : క్వారంటైన్ లో యువకుడి ఆత్మహత్య !
By: Tupaki Desk | 19 May 2020 7:45 AM GMTతమిళనాడులో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ నమోదవుతున్న వందలాది కేసులతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే 7వేలు దాటిపోయింది. దీనితో రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అనుమానితులకు పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ తరుణంలోనే మహమ్మారి సోకిందన్న అనుమానంతో క్వారంటైన్ కు తరలించిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారు ఆందోళకు గురవుతున్నారు.
పూర్తి వివరాలు చూస్తే .. తేని జిల్లా ఆండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబై నుండి స్వగ్రామానికి చేరుకున్నాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్ లోనే ఉండాలని డాక్టర్లు, అధికారులు అతనికి సూచించారు. అయితే, దానికి అతడు ఒప్పుకోలేదు, తనకు ఎలాంటి మహమ్మారీ లక్షణాలు లేనప్పుడు క్వారంటైన్ లో ఎందుకు ఉండాలని శశికుమార్ అధికారులని నిలదీశాడు. అయితే , 14 రోజులు ఇక్కడ ఉంటేనే నిన్ను ఇంటికి పంపిస్తామని అధికారులు ఖరాకండిగా చెప్పేసారు.
దీంతో మనస్తాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతడి మరణ సమాచారంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తనను క్వారంటైన్ కు తరలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.