Begin typing your search above and press return to search.
14 ఏళ్ల బాలిక సూసైడ్ నోట్.. చదివారంటే కన్నీళ్లు ఆగవు..!
By: Tupaki Desk | 10 Feb 2021 7:30 AM GMTఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఓ బాలిక (14) ప్రాణాలు తీసుకుంది. తల్లి దండ్రులు కోల్పోయి.. అమ్మమ్మ వద్ద చదువుకుంటున్న ఓ అమ్మాయికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావించారు. కానీ ఆ ఆమెకు మాత్రం పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదు. దీంతో సుసైడ్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నది. ఆ బాలిక సూసైడ్ నోట్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన సంపంగి వెంకటమ్మ, నర్సింహులు దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు మృతి చెందారు. తల్లి వెంకటమ్మ కూడా నాలుగేళ్ల క్రితం చనిపోయారు. వారి బిడ్డ రేణుక (14) పెద్దేముల్ మండలంలోని మంబాపూర్‌లో ఉన్న అమ్మమ్మ అనంతమ్మ వద్ద ఉంటోంది. ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే అమ్మమ్మ బాలికకు పెళ్లి చేయాలని నిర్ణయించింది. కానీ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో రేణుకపై కుటుంబసభ్యులు నిందలు మోపారు.
దీంతో రేణుక ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నది. ‘అమ్మమ్మా నన్నుక్షమించు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దని నేను ఎంత చెప్పినా వినకుండా మీరు సంబంధాలు చూస్తున్నారు. నాకు చదువుకోవాలని ఉందని చెప్పినా వినడం లేదు. పైగా నాపై లేనిపోని నిందలు మోపుతున్నారు. అందుకే ఈ అపవాదులు భరించలేక చనిపోతున్నా’ అంటూ రేణుక సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఈ సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. బాల్యవివాహాలు చేయడం నేరం అని తెలిసినా.. ఇప్పటికే అనేక పల్లెల్లో గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి.