Begin typing your search above and press return to search.
మద్యం ఎఫెక్ట్..భార్య తిడుతుందంటూ మందుబాబు ఆత్మహత్యాయత్నం!
By: Tupaki Desk | 8 May 2020 11:30 PM GMTకరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వల్ల మద్యం దుకాణాలు కూడా మూసేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి మందుబాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. తాగడానికి చుక్క మందు లేక మందుబాబులు పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. కొంతమంది మందు దొరకక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయితే , గత 40 రోజులుగా మందు లేకపోవడంతో భార్య , భర్తల గొడవలు చాలావరకు పూర్తిగా తగ్గిపోయాయి.
అయితే , ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది అని చెప్పి ..లాక్ డౌన్ నుండి మద్యం షాప్స్ కి మినహాయింపు ఇచ్చారు. దీనితో మందుబాబులకు ప్రాణం లేచొచ్చినట్టు అయింది. మందుషాప్స్ తెరుస్తామని ప్రకటించిన క్షణం నుండే మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. మద్యం అమ్మకాలు మళ్లీ జోరందుకోవడంతో గృహహింస కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాగి ఇంటికి వచ్చిన భర్తలు.. భార్యల మీద దాడి చేయడం, గృహహింస లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, తాగి ఇంటికి వచ్చిన తనను భార్య తిట్టిందన్న కోపంతో ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు.
గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి నులక పేటకు చెందిన చిట్టిబాబు మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతో ఫుల్ గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. సుమారు 40 రోజులకు పైగా లాక్ డౌన్ తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో గుంటూరు జిల్లాలో కూడా మందుబాబులు వైన్ షాపుల వద్ద క్యూ కట్టారు. చిట్టిబాబు కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య అతడిని తిట్టింది. మందు తాగే వారు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. భార్య తనను తిట్టిందన్న కోపంతో మందుబాబు (చిట్టిబాబు) మరుగుతున్న నీళ్లను మీద పోసుకున్నాడు. దీనితో అప్పటి వరకు తిట్టిన భార్య గగ్గోలు పెడతూ వెంటనే 108 ఆంబులెన్స్ కు ఫోన్ చేసింది. వేడినీళ్లు మీద పడడంతో చిట్టిబాబు ఛాతీ - పొట్ట - చేతుల మీద తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.