Begin typing your search above and press return to search.
ఆధారాల్లేని వార్తలపై దావా వేస్తా: కలహర్ రెడ్డి
By: Tupaki Desk | 14 April 2021 8:55 AM GMTబెంగళూరు డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఫైనాన్షియర్ కలహర్ రెడ్డి వివరణ ఇచ్చారు.తనపై నిరాధార వార్తలు రాసిన ఓ దినపత్రిక, ఓ టీవీ చానెల్ కు త్వరలోనే లీగల్ నోటీసులు పంపుతున్నానని.. పరువు నష్టం దావా కూడా వేస్తానని వెల్లడించారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలహర్ రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం ఉందంటూ కొన్ని పత్రికలు, చానెల్స్ లో వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. తాను మూడేళ్ల కింద బెంగళూరులో జరిగిన బర్త్ డే పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే అన్నారు. ఆ పార్టీకి తనతోపాటు 300 మంది వరకు అతిథులు హాజరయ్యారని తెలిపారు.
ఆ రోజు జరిగిన విందులో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. తనకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని.. స్టేట్ మెంట్ రికార్డు కోసమే తనను పిలిపించారని తెలిపారు.వివరాలు ఇచ్చాన్నారు.
స్టేట్ మెంట్ ఇచ్చినంత మాత్రాన డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం అంటగడుతారని కలహర్ రెడ్డి ప్రశ్నించారు. మీడియాలో తన పేరు ప్రస్తావనపై తాను, తాను కుటుంబం ఎంతో కలత చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫేస్ బుక్ వాల్ పై నుంచి ఫొటోలు తీసి ఎలా మీడియాలో ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు.
ఈ పార్టీకి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని కలహర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ బర్త్ డే పార్టీ కూడా 2018 అక్టోబర్ లో జరిగిందని.. తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లమని.. ఐదేళ్ల క్రితం నుంచి నిర్మాత శంకర్ గౌడ్ తో పరిచయం ఉందన్నారు.