Begin typing your search above and press return to search.

మంత్రి సెక్స్ టేప్ వివాదంలో అనూహ్య ట్విస్ట్?

By:  Tupaki Desk   |   8 March 2021 4:55 AM GMT
మంత్రి సెక్స్ టేప్ వివాదంలో అనూహ్య ట్విస్ట్?
X
కర్ణాటకలో రాష్ట్ర మంత్రి సెక్స్ టేప్ బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ సెక్స్ టేప్ వివాదంలో తాజాగా అనూహ్యమైన ట్విస్ట్ చోటుచేసుకుంది.

మంత్రి రాసలీలల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సామాజిక కార్యకర్త దినేశ్ కళహల్లి తాజాగా ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు ఆయన లేఖ పంపించినట్టు తెలుస్తోంది. మంత్రి రమేశ్ పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని అందులో కోరారు.

దినేశ్ తరుఫున కేసు ఉపసంహరణ లేఖను కబ్బన్ పార్క్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించారు. తన క్లైంట్ దినేశ్ పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని.. కేసును ఉపసంహరించుకోవాలని ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

రూ.5 కోట్ల కోసం డిమాండ్ చేసి ఇదంతా చేస్తున్నట్లుగా దినేశ్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళ, ఆమె కుటుంబం పరువు పోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి రమేశ్ పై కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడని దినేష్ న్యాయవాది మీడియాకు తెలిపారు. మాజీ సీఎం కుమారస్వామి సైతం ఈ కుట్ర వెనుక రూ.5 కోట్ల డీల్ ఉందని ఆరోపించడం కేసు ఉపసంహరణకు కారణమన్నారు.

కాగా దినేష్ లేఖను పరిగణలోకి తీసుకొని ఈ కేసు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు.

కేసు విషయానికి వస్తే.. కర్ణాటకలో కొలువుదీరిన బీజేపీ సర్కారులో యడ్యూరప్ప మంత్రివర్గంలోని కీలక మంత్రి రమేశ్ జర్కిహోళి ఒక యువతితో గడిపిన వీడియో లీక్ అయ్యి ఆయన పరువు తీసింది. ఉద్యోగం ఇప్పిస్తానని.. సదురు మంత్రి గారు ఆ అమ్మాయిని వాడుకున్నట్టు భోగట్టా. మంత్రిగారు శృంగార ఢోలికల్లో మునిగితేలినప్పుడు ముచ్చటపడి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. బట్టల్లేకుండా తీసుకున్న ఈ వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో పెద్ద దుమారం చెలరేగింది. కీలక మంత్రిగా ఉండి ఇలా చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. టీవీ చానళ్లు ఇప్పుడు ఈ వీడియోను హోరెత్తించాయి. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.