Begin typing your search above and press return to search.
కేసీఆర్ సడెన్ గా ఎందుకు మారారు?
By: Tupaki Desk | 27 Jun 2021 4:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను బయటకు పంపడం.. తదనంతర విమర్శలు, ప్రతివిమర్శలు, లాక్ డౌన్ ఎత్తేసాక కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో మినహా ఇంత యాక్టివ్ గా ఎప్పుడూ లేడని.. అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లింది లేదని చెబుతున్నారు.
కేసీఆర్ తాజాగా జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు, హామీలు, లక్ష్యాలు ఇలా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది. నిజానికి కేసీఆర్ మార్పునకు కారణం ఈటల రాజేందర్ అనేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ‘ప్రగతి భవన్ , ఫాంహౌస్ వదిలి కేసీఆర్ బయటకు రారని.. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలను కలవరని.. ఆయనకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని..గ డిలో కూర్చుంటాడని’ ఈటల తీవ్ర విమర్శలు చేశారు. దాన్ని సవరించేలానే కేసీఆర్ జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
ఇక హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనే ‘ఏపీతో కృష్ణా జలాల వివాదం.. మంత్రుల మాటల మంటలు చెలరేగడం ఆసక్తి రేపుతోంది. ఇక కేసీఆర్ సైతం ఊహించని విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇచ్చి భిన్నంగా వ్యవహరించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా కాంగ్రెస్ ను కేసీఆర్ చేరదీస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
దూసుకొచ్చిన షర్మిల పార్టీని కంట్రోల్ చేయడానికి కూడా సీఎం కేసీఆర్ ఏపీ నీటి వివాదాలను తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఏపీకి చెందిన షర్మిల ఈ విషయంలో డిఫెన్స్ లో పడేలా కేసీఆర్ వ్యూహరచన చేశారని చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను తట్టి లేపడం.. కాంగ్రెస్ ను చేరదీయడం.. దళిత మహిళ లాకప్ డెత్ తో దళితుల మనసు చూరగొనడం.. హుజూరాబాద్ లో బీజేపీకి అవకాశాలు సన్నగిల్లేలా చేసే రాజకీయ వ్యూహానికి కేసీఆర్ తెరదీశారని అంటున్నారు.
తనపై మరక అంటకుండా.. విమర్శకుల నోళ్లు మూయించేలా.. అదే సమయంలో కొత్త రాజకీయ శక్తులను అరికట్టేందుకే కేసీఆర్ ఇలా సడెన్ గా మారిపోయారని.. ఈటల రాజేందర్ విమర్శల నేపథ్యంలోనే జనంలోకి వచ్చారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.