Begin typing your search above and press return to search.

రవ్వంత రెడ్డి నోటికి కుట్లు వేస్తారంట

By:  Tupaki Desk   |   2 July 2015 9:01 AM GMT
రవ్వంత రెడ్డి నోటికి కుట్లు వేస్తారంట
X
ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయి.. హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చిన రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్‌ అవుతున్నారు. చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌ మీద బయటకు వచ్చిన రేవంత్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా.. ఆయన మంత్రివర్గ అనుచరుల మీద ఏ రేంజ్‌లో విరుచుకుపడ్డారో తెలిసిందే.

తిట్టిన తిట్టు తిట్టకుండా.. తిట్లనే మాటలుగా చేసుకొని మాట్లాడిన ఆయనకు కౌంటర్‌ ఇచ్చేందుకు తెలంగాణ అధికారపక్షం నేతలు ఒక్కొక్కరుగా సిద్ధం అవుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌ను రవ్వంత రెడ్డిగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమం కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే హక్కు రేవంత్‌రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. అనవసరంగా తమ నేతల్ని తిడుతున్న రేవంత్‌ నోటికి కుట్లు వేసి.. నోరు మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. విమర్శలకు ప్రతివిమర్శలు బాగానే ఉంటుంది కానీ.. నోరు తెరవకుండా కుట్టేస్తామని చెప్పటం ఏమిటి? చూస్తుంటే.. రేవంత్‌ మాటల ప్రభావం టీఆర్‌ఎస్‌ నేతల మీద భారీగానే ప్రభావం చూపించినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.