Begin typing your search above and press return to search.

నా ఫ్లైట్ టికెట్ కోసం నా తండ్రి ఏడాది సాలరీ ఖర్చు పెట్టారు: సుందర్ పిచాయ్

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:00 PM GMT
నా ఫ్లైట్ టికెట్ కోసం నా తండ్రి ఏడాది సాలరీ ఖర్చు పెట్టారు: సుందర్ పిచాయ్
X
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కరోనా-లాక్ డౌన్ వేళ విద్యార్థుల్లో అద్భుతంగా స్ఫూర్తి నింపారు. తన చిన్నతనంలో ఎంత కష్టపడ్డది.. తాను గూగుల్ సీఈవో అయ్యే క్రమంలో పడ్డ కష్టాన్ని వివరించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. తన తండ్రి పడ్డ కష్టం గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పలు అంశాలను వెల్లడించారు. గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తాను కష్టపడ్డానని వివరించారు.స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు అమెరికా వెళ్లేటప్పుడు విమాన టికెట్ కొనేందుకు తన తండ్రి ఏడాది జీతాన్ని ఖర్చు చేయాల్సి వచ్చిందని సుందర్ పిచాయ్ వివరించారు.

అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని.. అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని.. బ్యాగ్ కొనాలంటే భారత్ లో తన తండ్రి నెలజీతం అంత మొత్తం వెచ్చించాల్సి వచ్చేదని తన అనుభవాలను పంచుకున్నారు.

మాతరం కనీసం కలలో కూడా ఊహించని కొత్తవాటిని ఈ తరం సుసాధ్యం చేయవచ్చన్నారు. గ్రాడ్యూయేట్లు ఆశావహంగా ఉండాలని.. సహనంతో ముందుకు సాగాలని సూచించారు.

చెన్నైలో పుట్టిపెరిగిన సుందర్ పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా.. స్టాన్ ఫర్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2004లో గూగుల్ లో చేరి నేటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను తయారు చేసి ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన బ్రౌజర్ గా నిలిపాడు.