Begin typing your search above and press return to search.
రాజకీయాల్లో ఇలాంటి స్నేహాలు చాలా అరుదు బాస్
By: Tupaki Desk | 8 Nov 2020 6:15 AM GMTఅమెరికా ఎన్నికల్ని కాసేపు మర్చిపోదాం. విషయం మరింత బాగా అర్థం కావాలంటే.. మన దగ్గరి ఉదాహరణ తీసుకుందాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ పడే నేతకు.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు.. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుంది? స్నేహం సంగతి తర్వాత.. కనీసం మాట్లాడుకుంటారా? ముఖం ముఖాలు చూసుకుంటారా? ఎత్తులు పైఎత్తులతో చిత్తు చేసుకుంటారే కానీ.. స్నేహం ఎక్కడ ఉంటుందని చెబుతాం. కానీ.. జో బైడెన్.. బరాక్ ఒబామాలు మాత్రం అందుకు పూర్తి భిన్నం.
అమెరికా అధ్యక్షుడిగా నేను చివరిసారిగా ప్రెసిడెన్షియల్ పతకాన్ని ఇస్తున్నా అన్న మాట ఒబామా నోటి నుంచి వచ్చినంతనే.. ఆ పతకాన్ని అందుకోవాల్సిన జో బైడెన్ వెనక్కి తిరిగి కన్నీరు పెట్టుకున్న ఘటన ఇంకా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు ఒబామాతో అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానికి ఆరాటపడిన బోడైన్.. తర్వాత వెనక్కి తగ్గటం ఒక ఎత్తు అయితే.. తాజాగా బైడెన్ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానిక ఒబామా పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆయన కోసం తానే బరిలో ఉన్నట్లుగా ప్రచారం తీరు చూస్తే.. రాజకీయాల్లో ఇలాంటి స్నేహాలు కూడా ఉంటాయా? అనిపించక మానదు.
సెనెటర్ గా 35 ఏళ్ల అనుభవం ఉన్న బైడెన్.. 2008లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఆయనకు పోటీగా మరో సీనియర్ క్రిస్ డోడ్ కూడా రంగంలోకి దిగారు. వీరికి పోటీగా యువకుడైన బరాక్ ఒబామా కూడా రంగంలోకి దిగారు. అప్పటికే ఇల్లీనాయిస్ సెనెటర్ గా మంచిపేరు తెచ్చుకున్న ఒబామా దెబ్బకు.. తనకు అవకాశం లభించదన్న విషయాన్ని బైడెన్అర్థం చేసుకున్నారు. పోటీ నుంచి వైదొలిగారు.
అభ్యర్థిగా బరిలోకి దిగి.. చివరకు అమెరికా అధ్యక్షుడైన ఒబామా.. తనతో పోటీ పడిన బైడెన్ ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు. అలా వారిద్దరి స్నేహం మొదలైంది. అధ్యక్షుడిగా వ్యవహరించిన రెండు దఫాలు.. బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఒబామాకు నీడలా ఉండేవారు జో. వీరిద్దరిని బ్రోమాన్స్ గా వర్ణిస్తూ చాలానే ఆర్టికల్స్ వచ్చాయి. అంతేకాదు.. అమెరికా తొలి మహిళ మిషెల్ కోసం లెట్స్ మూవ్ ప్రచారం కోసం వీరిద్దరూ ఒక వీడియోల నటించారు. అది అప్పట్లో పెను సంచలనంగా మారింది.
ఒబామా - జో మధ్య అనుబంధం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. వ్యక్తిగతంగానూ వారిద్దరు.. వారి రెండు కుటుంబాలు చాలా సన్నిహితం. జో కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురైతే.. ఒబామా తనకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చిన విషయాన్ని జో చెబుతారు. అంతేకాదు.. ఒబామా సతీమణి.. జో భార్య ఇద్దరు మంచి స్నేహితురాళ్లు. అంతేకాదు.. బైడెన్ మనమరాళ్లు.. ఒబామా కుమార్తెలకు మంచి దోస్తీ ఉంది. ఇలాంటి అనుబంధం.. స్నేహం.. ఒకప్పటి ప్రత్యర్థుల మధ్య ఉండటం చాలా అరుదుగా ఉండేదని మాత్రం చెప్పక తప్పదు.