Begin typing your search above and press return to search.
ఇవాల్టి అప్పు రూ.900 కోట్లు.. ఏపీ మొత్తం రుణభారం జస్ట్ అంతేనట
By: Tupaki Desk | 28 Feb 2023 11:07 AM GMTనిద్ర లేచిన వెంటనే ఈ రోజును ఎలా మొదలుపెడదాన్న ఉత్సాహం చాలామందిలో ఉంటుంది. కొందరిలో మాత్రం.. మళ్లీ ఇంకో రోజు వచ్చిందా? ఈ రోజును ఎలా నెట్టుకొద్దామన్న ఆలోచనతో సతమతమవుతుంటారు. ఏపీ రాష్ట్ర పరిస్థితి కూడా రెండో తీరులో ఉంటుంది.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రాష్ట్రాన్ని నడపటానికి అవసరమైన నిధుల సమీకరణ ఎలా చేయాలన్నది ప్రభుత్వంలోని పలువురు అధికారులు కిందా మీదా పడిపోయే పరిస్థితి. ఏది ఏమైనా.. తాను అమలు చేసే సంక్షేమ పథకాల్ని ఆపకూడదన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి తీరుతో ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారటం తెలిసిందే.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు.. రిటైర్డు ఉద్యోగాలకు ఇవ్వాల్సిన ఫించన్లు.. ఎప్పుడు ఇస్తారన్న విషయంపై క్లారిటీ లేకున్నా.. తురచూ తాను నొక్కే బటన్లతో సంక్షేమ పథకాల లబ్థిదారులు బ్యాంకు అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతున్న మెసేజ్ లు చూసుకోవాలన్న తపన జగన్ సర్కారులో ఉండటం తెలిసిందే. ఈ తీరు ఇప్పుడా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది.
సంక్షేమ పథకాల అమలుకు వ్యతిరేకం కాదు. కానీ.. అదెంత మోతాదులో ఉండాలన్న విషయంపై ఒక స్పష్టత ఉండటంతో పాటు.. వాటి కోసం ఇప్పుడు చేస్తున్న అప్పుల్ని.. భవిష్యత్తులో ఎలా తీరుస్తారన్న దానిపైనా ఒక వ్యూహం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ లేకుండా అప్పు చేయటమే అసలు పని అన్నట్లుగా వ్యవహరించటంతోనే సమస్యలు మొదలవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వ పరిస్థితి ఎలా మారిందంటే.. ఏ రోజుకు ఆ రోజు గడవటమే కష్టమన్న రీతిలో పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఏపీ ప్రభుత్వం రూ.900కోట్లు అప్పు చేయనుంది. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన అప్పు రూ.84,400 కోట్లకు చేరనుంది. మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో.. ఏడాదిలో చేసే అప్పు దగ్గరదగ్గర రూ.లక్ష కోట్ల మేర ఉండటం ఆందోళనకు గురి చేసే అంశం. అప్పు చేయటం సరే.. దాన్ని తీర్చటం ఎలా? అదెలా సాధ్యం? అన్న ప్రశ్నలకు ఎవరి వద్దా సమాధానం లేని పరిస్థితి.
దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత అప్పు చేసిన దాఖలాలు లేవని.. జగన్ ప్రభుత్వం మాత్రం ఆ పని చేసిందన్న విమర్శ వినిపిస్తోంది. తాజాగా తెచ్చే రూ.900 కోట్ల అప్పుతో ఏపీ అప్పు రూ.10.20 లక్షల కోట్లుగా మారనుంది. మరింత క్లియర్ గా చెప్పాలంటే ఏపీ అప్పు రూ.10,20,373 కోట్లుగా చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో చేసి అప్పు ప్లస్ బకాయిలు కలిపి ఏకంగా రూ.6,57,998కోట్లుగా చెబుతున్నారు. తాజా లెక్క ప్రకారంగా ఏపీలోని ప్రతి తలకాయ మీద ఉన్న అప్పు రూ.2లక్షలుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.