Begin typing your search above and press return to search.

చలిలో వణుకుతున్న యాచకుడి వెనుక అంత పెద్ద కథ

By:  Tupaki Desk   |   15 Nov 2020 8:10 AM GMT
చలిలో వణుకుతున్న యాచకుడి వెనుక అంత పెద్ద కథ
X
అచ్చం సినిమాల్లో మాదిరే సినిమాటిక్ సీన్లు కొన్ని రియల్ లైఫ్ లో చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవకు చెందినదే. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగర డీఎస్పీకి ఎదురైన తాజా ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి విన్నవారంతా షాక్ తింటున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

తాజాగా ముగిసిన గ్వాలియర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ తన వాహనంలో వెళుతున్నారు. అక్కడి పుత్ పాత్ మీద చలికి వణుకుతున్న యాచకుడ్ని చూసి ఆయన తన వాహనాన్ని ఆపారు. వణుకుతున్న అతనికి తన కోటును తీసి ఇచ్చారు. ఆ సందర్భంగా యాచకుడికి దగ్గరగా వెళ్లారు.

యాచకుడి ముఖాన్ని చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే.. ఆ వ్యక్తి మరెవరో కాదు.. తన బ్యాచ్ కు చెందిన అధికారి అన్న విషయాన్ని గుర్తించారు. పదేళ్లుగా ఎవరికి కనిపించకుండా పోయిన వ్యక్తి.. చలిలో రోడ్డు మీద ఇలా వణుకుతున్న దీన స్థితిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ యాచకుడ్ని మనీష్ మిశ్రాగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

1999 బ్యాచ్ పోలీసు అధికారిగా.. రాష్ట్రంలోని పలు స్టేషన్లలో పని చేసిన ఆయన మానసిక పరిస్థితి తర్వాతి దశలో దిగజారింది. ఇంట్లోని వారుచికిత్స అందిస్తున్నా.. ఒక రోజు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఇలాంటివేళ.. అనుకోని రీతిలో పుట్ పాత్ మీద మనీష్ యాచకుడిగా కనిపించటంతో కదలిపోయారు. ఒక ఎన్జీవో వద్దకు తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య సాయం అందిస్తున్నారు. సంబంధం లేకుండా మాట్లాడుతున్న అతగాడి మంచి చెడ్డలు చూసుకునేందుకు సదరు అధికారి సిద్ధమయ్యారు. ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.