Begin typing your search above and press return to search.

12 ఏళ్ల కృషి సక్సెస్.. వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ!

By:  Tupaki Desk   |   25 May 2021 8:30 AM GMT
12 ఏళ్ల కృషి సక్సెస్.. వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ!
X
శాస్త్రవేత్తలు అనుకోవాలే గానీ చేయలేనిది ఏమీ ఉండదు. కాస్త టైం అటూ ఇటూ అయినా దేనినైనా సృష్టించగలరు. ఈ వాక్యాలను అక్షరాల నిజం చేశారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వారి 12 ఏళ్ల కృషికి ఫలితం దక్కింది. ఈ సక్సెస్ తో వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. శాస్త్రవేత్తల ఈ పరిశోధనలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా?

ప్రపంచంలో ఇప్పటి వరకు సృష్టించని అత్యంత చిన్న కృత్రిమ గుండెను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ బృందం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఎంతో శ్రమ అనంతరం ఈ ఆవిష్కరణ సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్ని కృత్రిమ హృదయం 24 రోజుల పిండం మాదిరిగా ఉంది.

నువ్వుల గింజ ఆకారంలో దీనిని సృష్టించారు. దీని సాయంత్రం చిన్నారుల గుండె నిర్మాణంపై పరిశోధనలు సులభం అవుతాయని నిపుణులు అంటున్నారు. పిండస్థ దశలోని గుండె జబ్బులు గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వైద్యం రంగంలో ఎన్నో ప్రయోగాలకు చాలా ఉపయోగపడుతుందని వెల్లడించారు.

తమ 12 ఏళ్ల కృషి ఫలించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిని తుది రూపు కోసం దాదాపు మూడు నెలలు ల్యాబ్ లోనే ఉన్నామని తెలిపారు. అయస్కాంతం, ద్రవ లెవిటేషన్ పద్ధతులను ఉపయోగించి అభివృద్ధి చేసినట్లు వివరించారు. దీని వలన గుండె పని సామర్థ్యాన్ని సులభంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.