Begin typing your search above and press return to search.

ధోనిపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్

By:  Tupaki Desk   |   16 Aug 2020 10:30 AM GMT
ధోనిపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్
X
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తాజాగా నిన్న రాత్రి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు.. క్రికెట్ ప్రేమికులు.. సినీ , రాజకీయ ప్రముఖులంతా షాక్ కు గురయ్యారు.

ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా ఎంఎస్ ధోని నిష్క్రమణపై సంచలన ట్వీట్ చేశారు.ఇదిప్పుడు వైరల్ గా మారింది.

సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేస్తూ ‘ఎంఎస్ ధోని క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. కానీ మిగిలిన వాటి నుంచి కాదు.. కష్టాలను జయించగల సత్తా ఆయనకు ఉంది. క్రికెట్ లో తన టీంకు ఆయన అందించిన లీడర్ షిప్ ప్రజలకు కూడా అవసరం. 2024 ఎన్నికల్లో ధోని లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలి’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

ధోని క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక.. రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి. తాజాగా స్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు దానికి బలాన్ని చేకూరుస్తోంది. ధోని బీజేపీలోకి చేరి జార్ఖండ్ సీఎం రేసులో ఉంటాడనే ప్రచారం ఉంది. మరి దీనిపై ధోని ఏమంటాడో వేచిచూడాలి.