Begin typing your search above and press return to search.

సుబ్రహ్మణ స్వామి ట్వీట్ దుమారం

By:  Tupaki Desk   |   28 Aug 2018 11:37 AM GMT
సుబ్రహ్మణ స్వామి ట్వీట్ దుమారం
X
మాల్దీవులు దేశం భారత్ తో ఎడం పాటిస్తోంది. చైనాకు దగ్గరవుతోంది. మాల్దీవుల్లో గత ఏడాది ఫిబ్రవరిలో 45 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని.. తిరిగి ఎన్నికలు జరపాలని ఒత్తిడి తెచ్చింది. ఇక అప్పటి నుంచి భారత్-మల్దీవుల మధ్య సంత్సబంధాలు క్షీణించాయి. ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ మల్దీవులలోని భారతీయులపై కఠిన ఆంక్షలు విధిస్తూ చైనా అనుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారు.

వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ భారత్-మల్దీవుల మధ్య చిచ్చు పెట్టింది. ఎప్పుడూ వివాదాలతో కాలం గడిపే సుబ్రహ్మణ్య స్వామి మల్దీవుల ఎన్నికలపై చేసిన ట్వీట్ ఆ దేశ ఆగ్రహానికి కారణమైంది.

సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేస్తూ.. ‘మల్దీవుల్లో జరగనున్న ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే భారత్ జోక్యం చేసుకొని ఆ దేశాన్ని ఆక్రమించాలి’ అని కోరారు. ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. మాల్దీవ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అక్కడి భారత హైకమిషనర్ అఖిలేష్ మిశ్రాను వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపింది. అంతేకాదు.. భారత్ ప్రభుత్వానికి ఓ లేఖ రాసి స్వామి ట్వీట్స్ పై నిరసన తెలిపింది. దీని తర్వాత మల్దీవ్ ప్రభుత్వం తమకు అనుకూలురైన ఏడుదేశాల అంబాసిడర్ లతో సమావేశమైంది.

తాజాగా ఈ వివాదంపై భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం స్వామి ట్వీట్ తో భారత ప్రభుత్వానికి సంబంధం లేదని.. అది ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఇప్పటికే దిగజారిపోతున్న మల్దీవుల-భారత్ సంబంధాలు సుబ్రహ్మణ్యం స్వామి ట్వీట్ తో మరింత దిగజారాయి.