Begin typing your search above and press return to search.
స్వామి పేల్చనున్న తర్వాతి బాంబు అదేనా?
By: Tupaki Desk | 19 Jun 2016 11:06 AMబీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా అంశం మీద స్వామి కానీ ఫోకస్ చేస్తే వారి పని ఏమవుతుందో ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. యూపీఏ సర్కారు కొంప ముంచిన 2జీ స్వామ్ స్వామి పుణ్యమేనని మర్చిపోకూడదు అంతదాకా ఎందుకు ఎవరికి కొరకరాని కొయ్యిలా ఉండే తమిళనాడు అమ్మ జయలలితను జైలుకు పంపి పుణ్య కట్టుకుంది కూడా స్వామినే. అలాంటి స్వామి.. రీసెంట్ గా ఆర్ బీఐ గవర్నర్ మీద ఫోకస్ చేసి.. ఆయన మీద తెగ ఆరోపణలు చేయటం.. ఆయన పదవీ కాలాన్ని పొడిగించకూడదంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
స్వామి చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ తో రాజన్ రియాక్ట్ కావటం.. తన పదవీ కాలం పూర్తి అయిన వెంటనే కాలేజీకి వెళ్లి పాఠాలు చెప్పుకోనున్నట్లు వెల్లడించటం తెలిసిందే. ఇలాంటి స్వామి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మరో సంచలన వ్యాఖ్య చేశారు. తన తర్వాతి టార్గెట్ ఎవరన్న విషయాన్ని రివీల్ చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వీర విధేయులుగా ఉంటున్న ప్రభుత్వ ఉన్నతాధికారుల వివరాల్ని తాను త్వరలో వెల్లడించనున్నట్లుగా పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. వివిధ మంత్రిత్వ శాఖల్లో దాదాపు 27 మంది వరకూ సోనియాగాంధీకి వీరవిధేయులు ఉన్నారని ఆయన చెబుతున్నారు. వీరిని తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి చిదంబరం ఎంపిక చేసినట్లుగా ఆయన నర్మగర్భంగా చెప్పిన మాటలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ముందు టీజర్ విడుదల చేయటం ఎలానో.. తాజాగా స్వామి మాటలు అదే తీరులో ఉండటం గమనార్హం. సో.. మరికొద్ది రోజుల్లో హాట్ హాట్ న్యూస్ ఒకటి బయటకు రానుందన్న మాట.